Jr NTR: అత్త కోసం అమెరికా నుంచి నేరుగా.. ఎమోషనల్ అయిన తారక్

|

Aug 04, 2022 | 8:12 PM

నందమూరి ఫ్యామిలీ లో కొద్దిరోజుల క్రితం ఓ విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు చిన్న కూతురు కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Jr NTR: అత్త కోసం అమెరికా నుంచి నేరుగా.. ఎమోషనల్ అయిన తారక్
Ntr
Follow us on

నందమూరి ఫ్యామిలీ లో కొద్దిరోజుల క్రితం ఓ విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు చిన్న కూతురు కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే ఉమామహేశ్వరి ఆత్మహత్యతో ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెల్లెలి మరణంతో నందమూరి బాలకృష్ణ కలత చెందారు. నిన్న ఉమామహేశ్వరి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి. బాలయ్య ఇతర సోదరులు ఉమామహేశ్వరి పాడే మోశారు. బరువెక్కిన గుండెతో బాలయ్య చెల్లెలి పాడే మోస్తుంటే నందమూరి అభిమానులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఉమామహేశ్వరి మరణ వార్త తెలియాగానే కుటుంబసభ్యులంతా ఆమె ఇంటికి చేరుకున్నారు. తారక్(Jr NTR) మాత్రం విదేశాల్లో ఉండటంతో ఆమెను కడసారి చూసేందుకు రాలేదు.

తాజాగా విదేశీ పర్యటన ముగించుకున్న తారక్ ఉమహేశ్వరి ఇంటికి వెళ్లారు. సతీసమేతంగా తారక్ ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లి కుటీరంభసభ్యులను పరామర్శించారు. తారక్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ తో సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి