ఆ సాంగ్ సినిమాకే హైలైట్.. షూటింగ్‌లో ఊహించని సంఘటన జరిగింది: జెడి చక్రవర్తి

ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, తోటి నటులతో తన అనుభవాలు, తన నటనా తత్వశాస్త్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే తన సినిమాల గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆ సాంగ్ సినిమాకే హైలైట్.. షూటింగ్‌లో ఊహించని సంఘటన జరిగింది: జెడి చక్రవర్తి
Jd Chakravarthy

Updated on: Nov 03, 2026 | 9:25 AM

ప్రముఖ నటుడు జెడి చక్రవర్తి గులాబి సినిమాలోని తన ఐకానిక్ సాంగ్ మేఘాలలో తేలిపొమ్మన్నది చిత్రీకరణకు సంబంధించిన మరపురాని జ్ఞాపకాలను, ముఖ్యంగా హీరోయిన్ మహేశ్వరితో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ పాట వైజాగ్‌లో షూట్ చేశారు, తాను బైక్ మీద వెళ్లే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. జెడి చక్రవర్తి దానికి తనదైన శైలిలో స్పందించారు. ఆ సాంగ్‌లో నిజంగానే పడిపోబోయామని, కానీ పడలేదు. తాను దాని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదని, ఈ విషయం చాలాసార్లు చెప్పినప్పటికీ, ప్రతిసారి చెప్పడం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. అసలు సంఘటన ఏమిటంటే, సినిమా కెమెరామెన్ రసూల్ (తర్వాత డైరెక్టర్ కూడా అయ్యారు), జెడి చక్రవర్తి, వంశీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. షూటింగ్ సమయంలో రసూల్, మహేశ్వరి ఒకరితో ఒకరు ఇంగ్లీష్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు. మహేశ్వరి కూడా చాలా ఇంగ్లీష్ పాటలు వినేదని, “నేను అది విన్నానండి, ఇది విన్నానండి” అని చెప్పేదని జెడి గుర్తు చేసుకున్నారు.

మారుతి వ్యాన్‌కి కెమెరాను వాక్యూమ్ గ్రిప్‌తో ఫిక్స్ చేసి షూటింగ్ చేస్తున్నారు. జెడి బైక్‌పై వచ్చి, కెమెరా ముందు నుంచి వెళ్లాలి. “ఒరేయ్ ఇప్పుడు కెమెరా ఎటు వెళ్ళాలిరా?” అని రసూల్‌ని అడిగాడట జెడి. మహేశ్వరితో మాట్లాడటంలో నిమగ్నమైన రసూల్, ఆలోచించకుండా “ఆహ్, లెఫ్ట్ కెళ్ళరా” అన్నాడట. జెడి “ఓకే రా” అని సమాధానం ఇచ్చి, బైక్‌తో స్టార్ట్ చేయగా, అప్పుడు వంశీ “ఏరా ఓకే అన్నావా?” అని అడిగాడు. “నేను బైక్ మీద ఇక్కడి నుంచి వస్తూ ఉంటా. సో ఇలా వస్తూ ఉన్నప్పుడు మరి కెమెరా వచ్చి గుద్దుకుంటాం కదా చచ్చిపోతాం. నేను లెఫ్ట్ కి వెళ్ళాలా, రైట్ కి వెళ్ళాలా?” అని జెడి చక్రవర్తి అడిగారట.

దీనికి తోడు, బైక్ ఎక్కిన వెంటనే మహేశ్వరి తనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందని జెడి చెప్పారు. “నేను లైఫ్ లో ఫస్ట్ టైం అండి బైక్ ఎక్కడం” అని మహేశ్వరి చెప్పగానే, జెడి ఆశ్చర్యపోయి “ఓసిని సిగదరగ..” అనుకున్నానని సరదాగా వెల్లడించారు. తాను బైక్‌లో రేసులు, ర్యాలీలకు వెళ్ళేవాడిని కాబట్టి, తనకు బైక్ స్పీడ్, ఫ్రేమ్ రేట్లకు సంబంధించిన టెక్నికల్ అంశాలపై అవగాహన ఉందని, అయితే ఈ విషయంలో రసూల్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగేది అని వివరించారు. నా బైక్, కెమెరా వ్యాన్ రెండు 80 స్పీడ్ తో వస్తున్నాయి.. దాంతో ఒక్కసారిగా వ్యాన్ ఎదురుగా రావడంతో ఏ లెఫ్ట్ కు వెళ్లాలో అర్ధం కాలేదు.. ఒక వైపు లోయ, మరో వైపు కొండ ఉంది. దాంతో నాకు ఆప్షన్ లేక వ్యాలిలోకి బైక్ ను పోనిచ్చా అలా పడిపోయాం కానీ ఏం జరగలేదు అని అన్నారు జెడి.  అయినా సరే, ఈ సంఘటనలన్నీ ఆనాటి షూటింగ్ వాతావరణాన్ని, సహనటులు, సాంకేతిక నిపుణుల మధ్య ఉన్న స్నేహబంధాన్ని, సరదా క్షణాలను గుర్తుచేస్తాయి. గులాబి చిత్రానికి మేఘాలలో తేలిపొమ్మన్నది పాట ఒక హైలైట్‌గా నిలిచిందని జెడి చక్రవర్తి అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us