
ప్రముఖ నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో తన సినీ, వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ఒక మరపురాని, భయానక అనుభవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక రాత్రి జూనియర్ ఎన్టీఆర్ తన కారులో జేడీ చక్రవర్తిని ఎక్కించుకుని మెహదీపట్నం నుండి టోలీచౌకి వైపు వెళ్తుండగా, కారు 110-120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని జేడీ గుర్తుచేసుకున్నారు. చెల్ చెల్ చెలి, మృగం చిత్రంలోని కొన్ని పాటలను ప్లే చేస్తూ, జూనియర్ ఎన్టీఆర్ అకస్మాత్తుగా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేశాడని జేడీ తెలిపారు. ఆ క్షణం తన ప్రాణానికి వెయ్యి కిలోమీటర్ల వేగంలా అనిపించిందని, ఎన్టీఆర్ కళ్ళు మూసుకుంటే ఇద్దరూ ప్రమాదంలో పడే అవకాశం ఉందని తాను చెప్పినట్లు వివరించారు. జూనియర్ ఎన్టీఆర్ మధ్యమధ్యలో కళ్ళు తెరిచి డ్రైవ్ చేయబట్టే తాను ఈరోజు ఈ ఇంటర్వ్యూలో ఉన్నానని జేడీ చక్రవర్తి సరదాగా నవ్వుతూ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ పాటలపై చాలా ఇష్టం ఉందని ఆయన ఈ పేర్కొన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో తరచుగా టచ్‌లో లేనని కూడా జేడీ స్పష్టం చేశారు.
ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..
ఓ నేస్తమా.. నువ్వే నా ప్రాణమా పాట అప్పట్లో ఎటువంటి గ్రాఫిక్స్ లేదా డ్రోన్ షాట్లు లేకుండా ఎలా అద్భుతంగా చిత్రీకరించబడింది అనే ప్రశ్నకు జేడీ సమాధానమిచ్చారు. దర్శకుడు వంశీ, తాను అమ్మాయిలతో బైక్ మీద డేటింగ్ వెళ్లాలనే కోరిక తమకు అప్పట్లో ఉండేదని, అదే ఆ పాట చిత్రీకరణకు ప్రేరణగా మారిందని చెప్పారు. వంశీ అద్భుతమైన కల్పన, తాను మూడుసార్లు బైక్ ర్యాలీ విజేత కావడం, 24 ఫ్రేమ్స్‌లో మాత్రమే షూట్ చేయాలని తాను కండిషన్ పెట్టడం ఆ పాట విజయం వెనుక కారణాలుగా జేడీ వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
జేడీ చక్రవర్తి తన జీవితంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన ఒక క్లిష్టమైన కాలాన్ని గుర్తుచేసుకున్నారు. ఇండియా, శ్రీలంకలోని డాక్టర్లు తన ఆరోగ్యంపై ఆశలు వదులుకున్నారని, తాను బతకడం కష్టమని నిర్ధారించారని తెలిపారు. అయితే, ఒక మిరాకిల్ లా తాను బతికి బయటపడ్డానని, చావడానికి బతికొచ్చాను అనే తాత్విక వాక్యాన్ని చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
Jd Chakravarty, Jr Ntr
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..