తల్లి మరణం.. జైలు నుంచి వచ్చి అంత్యక్రియలు నిర్వహించిన ఫన్ బకెట్ భార్గవ్.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో

తనను కనిపెంచిన తల్లి మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయాడు ఫన్ బకెట్ భార్గవ్. ఆమె పార్థీవ దేహంపై తల పెట్టి గుండెలవిసేలా రోదించాడు. అతనిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చూసిన వారందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

తల్లి మరణం.. జైలు నుంచి వచ్చి అంత్యక్రియలు నిర్వహించిన ఫన్ బకెట్ భార్గవ్.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో
Fun Bucket Bhargav

Updated on: Jul 01, 2026 | 8:52 PM

టిక్ టాక్ లు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ ఓ అత్యాచారం కేసులో జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే అతని తల్లి కన్నుమూసింది. దీంతో ఆమెను కడసారి చూసేందుకు, కొడుకుగా తన బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రత్యేక అనుమతితో జైలు నుంచి బయటకు వచ్చాడు భార్గవ్. అయితే తనను కనిపెంచిన తల్లి అచేతన స్థితిలో ఉండడాన్ని చూసి భార్గవ్ తట్టుకోలేకపోయాడు. ఆమె పార్థీవ దేహంపై తల పెట్టి గుండెలవిసేలా రోదించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో ఓదార్చుతున్నా భార్గవ్ మాత్రం ఏడుపు ఆపలేదు. ఈ విషాదం జరిగి మూడు రోజులవుతుండగా, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారందరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు. భార్గవ్ లాంటి దీన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నారు.

యూట్యూబర్ గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భార్గవ్. టిక్ టాక్ లు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో ఎంతో మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలతో భార్గవ్ పేరు మార్మోగిపోయింది. కొన్ని టీవీ షోల్లోనూ కనిపించాడీ సోషల్ మీడియా సెన్సేషన్. అయితే తనకొచ్చిన మంచి పేరును దుర్వినియోగం చేసుకున్నాడు. తనతో పాటు వీడియోలు చేసే ఓ 14 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు భార్గవ్. ఈ విషయమై 2021 ఏప్రిల్ 16న బాధితురాలి తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించిది. ఈ కేసుపై విచారణ చేప‌ట్టిన పోలీసులు భార్గవ్‌ను ‘దిశ’, ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు గతేడాది జనవరిలో తీర్పు వెలువరించింది. మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డినందుకు గానూ ఫ‌న్ బ‌కెట్ భార్గ‌వ్‌కి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us