
జబర్దస్త్ వేదికపై తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు గడ్డం నవీన్. తన రెండున్నర దశాబ్దాల సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిన్ననాటి నుండే సినిమాలపై మక్కువ పెంచుకున్న నవీన్, ఆరవ తరగతిలో ఉన్నప్పుడు తన ఇంటి వద్ద జరిగిన ఒక హిందీ సినిమా షూటింగ్ చూసి సినీ రంగం వైపు ఆకర్షితులయ్యారు. చిరంజీవి, కృష్ణ సినిమాలను చూసి స్ఫూర్తి పొంది, హీరో అవ్వాలనే లక్ష్యంతో పరిశ్రమలోకి ప్రవేశించారు. మాస్తిమల్ జైన్ అనే స్నేహితుడి సహాయంతో పోర్ట్‌ఫోలియో చేయించుకొని, అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినట్లు నవీన్ గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో కో-డైరెక్టర్లు లేదా మేనేజర్‌లు ఫోటోలు చూసి ఈ అబ్బాయిని ఆ గ్యాంగ్‌లో పెట్టండి, హీరో ఫ్రెండ్స్‌తో పెట్టండి అని చెప్పేవారట. మొదట హీరోగా ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యం కాదని గ్రహించి, స్నేహితుడి పాత్రలతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత ఒక సినిమాలో రౌడీ బ్యాచ్‌లో అవకాశం రావడంతో, తన జుట్టును చూసి ఆ పాత్రకు ఎంపిక చేశారని తెలిపారు. నిజానికి నవీన్‌కు మొదట్లో గడ్డం ఉండేది కాదని, క్లీన్ షేవ్‌తో స్మార్ట్‌గా, ఆర్‌ఎక్స్ 100 హీరో సాయి ధరమ్ తేజ్ లాగా, బన్నీ, యోగి, దేశముదురు సినిమాల్లోలాగా చాలా జుట్టు ఉండేదని వివరించారు. కష్టాల కారణంగా జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చిన తర్వాత, గడ్డం పెంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఒక ఆడిషన్‌లో సురేందర్ రెడ్డి తన గడ్డం తీయమని చెప్పినా, తన లుక్‌ను అలాగే ఉంచమని కిక్ 2 సినిమాలో ఊరి బ్యాక్‌గ్రౌండ్ పాత్రకు ఎంపిక చేశారని, అలా గడ్డం నవీన్‌గా మారారని తెలిపారు. ధ్రువ సినిమాలో పోలీసు పాత్రకు గడ్డం తీయాల్సి వచ్చిందని కూడా ఆయన పంచుకున్నారు.
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, నవీన్ తన మొదటి సినిమా ప్రేమించేది ఎందుకమ్మా షూటింగ్‌లో తన భార్యను కలిశారని చెప్పారు. వారిది ప్రేమ వివాహమని, ఆమె బాలీవుడ్‌లో మాధురి దీక్షిత్, పూజా భట్, ఊర్మిళ మాతోండ్కర్, మనీషా కొయిరాలా వంటి ప్రముఖ నటీమణులకు బాడీ డబుల్‌గా పని చేశారని వెల్లడించారు. తాను అరటి తొక్క వేసి జారిపడ్డానని సరదాగా చెబుతూ, రోజు లొకేషన్‌లో ఆమెను చూసి ఇష్టపడి, ఫ్లర్టింగ్ ద్వారా దగ్గరయ్యారని వివరించారు. బ్యాటరీలు ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరితో ఒకరు పాటలు వినడం వంటి చిన్నపాటి సంఘటనలతో వారి ప్రేమ మొదలైందని, ఆ తర్వాత మహేశ్వరి, పరమేశ్వర్ థియేటర్లలో హమారా దిల్ ఆప్కే పాస్, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలు చూసి, చివరికి ఐ లవ్ యూ చెప్పి, దొంగ పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఆరు నెలల తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నామని చెప్పారు. వారికి అక్షయ్ కుమార్, దినేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. దినేష్ పేరు తన బాస్ పేరు మీద పెట్టినట్లు పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..