Jabardasth Praveen: పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. ఫైమా రియాక్షన్ ఏంటో చూశారా? వీడియో వైరల్

జబర్దస్త్ ఫేమ్ పటాస్ ప్రవీణ్ ఓ ఇంటివాడయ్యాడు. తాను మనసిచ్చిన అమ్మాయితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు. తాజాగా వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే..

Jabardasth Praveen: పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. ఫైమా రియాక్షన్ ఏంటో చూశారా? వీడియో వైరల్
Jabardasth Praveen

Updated on: May 10, 2026 | 10:32 AM

జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. సింగిల్ లైఫ్ కు బై బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ప్రముఖ నటి, డ్యాన్సర్ కడెం వంశిత తో ప్రవీణ్ వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అలాగే పలువురు బుల్లితెర ప్రముఖులు ప్రవీణ్- వంశితల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. అయితే జబర్దస్త్ లో ప్రవీణ్ తో కలిసి ఎన్నో స్కిట్స్ చేసిన ఫైమా మాత్రం ఈ వెడ్డింగ్ కు హాజరుకాలేకపోయింది. దీంతో వీడియో కాల్ ద్వారా నూతన దంపతులకు అభినందనలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫైమానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా ప్రవీణ్’ అంటూ విషెస్ చెప్పింది. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. జబర్దస్త్ కమెడియన్లతో పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ప్రవీణ్-వంశిత దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ప్రవీణ్- వంశితలు చాలా కాలంలో ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారని టాక్. కాగా కడెం వంశిత నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక పటాస్ తో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కామెడీ పంచులతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీషోల్లోనూ సందడి చేస్తున్నాడు ప్రవీణ్.
అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతోనూ అలరిస్తున్నాడీ జబర్దస్త్ కమెడియన్.

ఇవి కూడా చదవండి

ప్రవీణ్ కు వీడియో కాల్ చేసి విషెస్ చెప్పిన ఫైమా.. వీడియో ఇదిగో..

కాగా ప్రవీణ్ గతంలో ఫైమాతో ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరిగింది. జబర్దస్త్ వేదికపై ఈ జోడికి మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు కలిసి చేసిన స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. దీంతో వీరు రిల్ లైఫ్ లో కూడా ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్లు వచ్చాయి. అయితే ఏమైందో కానీ ఇద్దరూ విడిపోయారని తెలిసింది

జబర్దస్త్ ప్రవీణ్- వంశితల పెళ్లి వీడియో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us