అందరిముందు ఆ హీరో పచ్చిబూతులు తిట్టాడు.. చాలా బాధపడ్డా..! : మహేష్ అచంట

తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు మహేష్ అచంట, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన కష్టాలు, సంతోషాలు, చేదు అనుభవాలను చూసాడు. ప్రస్తుతం సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్నాడు. జబర్దస్త్ ద్వారా మహేష్ కు మంచి గుర్తింపు వచ్చింది.

అందరిముందు ఆ హీరో పచ్చిబూతులు తిట్టాడు.. చాలా బాధపడ్డా..! : మహేష్ అచంట
Mahesh

Updated on: Mar 08, 2026 | 11:34 AM

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఆతర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు మహేష్.. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో రామ్ చరణ్ తో పాటు సినిమా అంతా టావెల్ అవుతుంది మహేష్ పాత్ర.. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల మహేష్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కళాకారుల జీవితం బయటికి కనిపించినంత సులువుగా ఉండదని, ఎన్నో అవమానాలు, తిరస్కరణలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయని మహేష్ తెలిపాడు. తన కెరీర్‌లో రెండు సంఘటనలు తనకు ఎంతో ఆనందాన్నిచ్చాయని మహేష్ తెలిపాడు.

వాటిలో ఒకటి, రంగస్థలం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇంకా విడుదల కాకముందే తన నటనను ప్రశంసిస్తూ, ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని చెప్పడం. రెండవది, రంగస్థలం సినిమా చూసిన తర్వాత, సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ ని అడిగి, తనను ఇంటికి పిలిపించి అభినందించడం. ఈ రెండు సందర్భాలు తనను ఎంతో సంతోషపెట్టాయని మహేష్ తెలిపాడు. అయితే, తన జీవితంలో ఒక బాధాకరమైన సంఘటనను కూడా ఆయన పంచుకున్నాడు. ఓ సందర్భంలో, తాను ఒక ప్రముఖ నటుడి పేరును రిఫరెన్స్‌గా చెప్పి ఒక ఆఫీస్‌కు వెళ్లగా, ఆ విషయం తెలిసిన ఆ నటుడు సెట్‌లో అందరి ముందు తనను తీవ్రంగా తిట్టారని మహేష్ అచంట గుర్తు చేసుకున్నాడు.

ఈ సంఘటన తనను బాగా బాధించినప్పటికీ, అదే తనకు ఒక పాఠం నేర్పిందని చెప్పాడు. అందరి ముందు ఆ హీరో తనను పచ్చి బూతులు తిట్టాడని దాంతో తనకు చాలా బాధగా అనిపించిందని తెలిపాడు. ఆ తర్వాత ఎవరైనా తన దగ్గరకు సహాయం కోసం వచ్చినా, లేదా తన పేరును రిఫరెన్స్‌గా ఉపయోగించినా తాను ఎప్పుడూ వారిని తిట్టడం, కోప్పడటం లాంటివి చేయకుండా, సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాను ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా, తన మాట సహాయంతో ఎంతో మందికి కోట్లాది రూపాయల ప్రాజెక్టులు, అవకాశాలు లభించాయని మహేష్ చెప్పుకొచ్చాడు. పది మందికి సహాయం చేస్తే, తొమ్మిది మంది గుర్తుపెట్టుకోకపోయినా, ఒకరైనా తిరిగి సహాయం చేస్తారన్న నమ్మకంతోనే తాను పనిచేస్తానని చెప్పుకొచ్చాడు.  అలాగే తనను తిట్టిన ఆ నటుడి పట్ల తనకు ఇప్పటికీ గౌరవం, అభిమానం ఉన్నాయని మహేష్ తెలిపాడు. చిన్నతనంలో ఆ నటుడిని చూసే తాను నటుడు కావాలని కలలు కన్నానని.. ఇప్పటికీ ఆయన తనకు కనిపించినప్పుడు పాదాలకు దండం పెట్టి నమస్కారం చేస్తానని అన్నాడు మహేష్. కానీ అతను ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us