
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ రాముడిగా నటించిన సినిమా ‘రామాయణం’. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా చేసింది. అలాగే కన్నడ స్టార్ యశ్ రావణుడిగా భయపెట్టనున్నాడు. దంగల్ తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన నితీశ్ తివారీ రామాయణం సినిమాకు దర్శకత్వం వహించారు. లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్ కొఠారే, శతృఘ్నుడిగా నితీశ్ శర్మ నటిస్తున్నారు. వీరితో పాటు సన్నీ డియోల్, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, హరీశ్ ఉత్తమన్, ఫైసల్ మాలిక్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, ముకేశ్ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్ సచ్దేవ్.. ఇలా ఎంతో మంది స్టార్స్ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డిఎన్ఇజి’ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇప్పటికే లాస్ ఏంజెల్స్ లో రామాయాణం ప్రీమియర్స్ పడగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇక ఇండియాలో నవంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రామాయణం రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.. అదేంటంటే.
కాగా సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే 2017 లోనే నిర్మాతలు నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్, మధు మంతెన కలిసి రామాయణం సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులైతే అప్పట్లో జరిగాయి. రణ్ బీర్ కపూర్ తో రామాయణం ను తెరకెక్కించిన నితీశ్ తివారీనే కూడా అప్పుడు డైరెక్టర్ గా ముందుకు వచ్చారు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రామాయణం సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను రాముడిగా ఫిక్స్ చేశారు. అలాగే మిగిలిన క్యాస్టింగ్ కూడా స్టార్ హీరో, హీరోయిన్లతో సెట్ చేయాలని అనుకున్నారు. ఇక ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావడమే తరువాయి. అయితే అంతలోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత నమిత్ మల్హోత్రా సింగిల్ గా ఈ ప్రాజెక్టు టేకప్ చేశాడు. రావణుడిగా నటించిన యష్ ని నిర్మాణ భాగస్వామిగా తీసుకుని రామాయణం సినిమాను పట్టాలు ఎక్కించారు. రణ్ బీర్ కపూర్ రామాయణం రిలీజ్ నేపథ్యంలో మరోసారి ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఒక వేళ రామ్ చరణ్ తో రామాయణం తీసి ఉంటే ఎలా ఉండేదోనని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి