
ఈ మధ్యన చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ని ఆధారంగా తెరకెక్కించిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 430 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాది బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం ఇవాళ తెలుగులో కూడా రిలీజైంది. మొదటి షోకే ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా అద్భుతంగా వస్తున్నాయి. ఇక బుక్ మై షో యాప్ లో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి గంటకు 2 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే తెలుగులోనూ హనుమాన్ అంశ్ సినిమాకు భారీ వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. కాగా ఈ సినిమాను తెలుగులో డబ్ చేసే ముందు నేరుగా తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారట. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలుగు లో తన సోదరుడు స్టార్ హీరో వెంకటేష్ తో రీమేక్ చెయ్యాలని అనుకున్నారట. అయితే వెంకటేష్ అప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారట. దీనికి తోడు హనుమాన్ అంశ్ సినిమా పూర్తి డివోషినల్ బ్యాక్ డ్రాప్ అని, తెలుగు లో కమర్షియల్ గా వర్కౌట్ అవ్వవని అన్నారట. ఒకవేళ మన తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే , సినిమాలోని సోల్ మిస్ అవుతుందని భావించారట. అందుకే రీమేక్ వద్దని చెప్పారట. దీంతో హనుమాన్ అంశ్ సినిమాని తెలుగు లో డబ్ చేసి విడుదల చేశారట.
కాగా గతంలో హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ మైగాడ్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి డివోషినల్ మూవీనే. అప్పుడు విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే హనుమాన్ అంశ్ విషయంలో మాత్రం ఎందుకో వెంకీ వెనక్కు తగ్గారట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వేళ వెంకటేష్ ఈ సినిమాను చేసుంటే బాగుండేదని, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు వచ్చేవని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ‘హనుమాన్ అన్ష్’ సినిమా విషయానికి వస్తే.. విశాల్ చతుర్వేది ఈ డివోషినల్ మూవీకి దర్శకత్వం వహించారు. చిత్రంలో నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించగా, విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమా తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే, భగవాన్‌దాస్ పటేల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి