టాలీవుడ్‌లోకి క్రేజీ హీరోయిన్.. జై హనుమాన్‌లో ఆ ముద్దుగుమ్మ కీలక పాత్ర.? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్‌లో ఉండగానే జై హనుమాన్ సినిమాను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా పోస్టర్ కూడా విడుదల చేసి ఒక్కసారిగా ఈ మూవీపైఅంచనాలు పెంచేశాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. కానీ ఎందుకోకానీ చాలా రోజులుగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.

టాలీవుడ్‌లోకి క్రేజీ హీరోయిన్.. జై హనుమాన్‌లో ఆ ముద్దుగుమ్మ కీలక పాత్ర.? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
Jai Hanuman

Updated on: Oct 11, 2026 | 3:44 PM

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ మమితా బైజు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారా? ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు ప్రచారంలో ఉన్న ‘జై హనుమాన్’ సినిమాలో ఆమె నటించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మమితా బైజు పేరు వినగానే చాలామంది తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ‘ప్రేమలు’. ఈ చిత్రంలో తన సహజమైన నటన, చలాకీదనంతో యువతను ఆకట్టుకున్న ఆమె.. దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. కేవలం గ్లామర్‌తోనే కాకుండా పాత్రకు తగ్గట్టుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడం మమితా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మలయాళ సినిమాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్న ఆమెకు ఇతర భాషల్లోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో ఆమె తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. హీరోలకు మించి క్రేజ్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందనున్న ‘జై హనుమాన్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘హనుమాన్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ.. ఈ సీక్వెల్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.. తాజాగా మమితా బైజు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, మమితా బైజు ‘జై హనుమాన్’లో నటిస్తున్నారనే విషయంపై చిత్రబృందం నుంచి అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

చిరు, బాలయ్యల, నాగ్, వెంకీలతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే సినిమాలకు దూరం.. ఇప్పుడు ఇలా

ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. విశ్వనాద్ అండ్ సన్స్, బెత్లెహెం కుడుంబ యూనిట్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుడ్ని. దాంతో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు ఈ చిన్నది జై హనుమాన్ సినిమాలో నటిస్తుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది చూడాలి.

Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us