సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ కుమార్ . వందకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళ్ భాషల్లో విభిన్నమైన పాత్రలు చేశారు. ముఖ్యంగా హీరో తండ్రి, తాత పాత్రలు ఎక్కువగా చేసి మెప్పించారు విజయ్ కుమార్. ఆయన కూతుర్లు కూడా హీరోయిన్స్ గా చేశారు. వీరిలో వనిత విజయ్ కుమార్ పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈమె సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనిత విజయ్ కుమార్ ఇప్పుడు ఆ ముగ్గురికి దూరం అయ్యింది. అలాగే స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతోనూ ఆమె వివాదం పెట్టుకుంది. అలాగే చాలా కాంట్రవర్షల్ కామెంట్స్ చేసి పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ భామ.. ఇప్పుడు నాలుగో పెళ్లికి వనిత విజయ్ కుమార్ రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది. వనిత విజయ్ కుమార్ 2000 సంవత్సరంలో హీరో ఆకాష్ ను తొలిసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆనంద్ అనే బిజినెస్ మెన్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ జయనిత్ అనే కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు.
పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడోసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వరుసగా పెళ్లిళ్లు చేసుకొని అవి పెటాకులు అవ్వడంతో.. ఇప్పుడు ఆమె ఫోకస్ మొత్తం సినిమాల పై పెట్టింది. కానీ ఆమెకు అంతగా అవకాశాలు రావడం లేదు. అయితే ఇప్పుడు ఆమె నాలుగోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. వనితకు అనుకున్నంతగా సినిమాలు రాకపోయినా.. యూట్యూబ్ ఛానెల్ పెట్టి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది. ఊహించని దారి గురించి ఎదురుచూడండి అంటూ చెప్పిందట వనిత విజయ్ కుమార్. అయితే ఈ కామెంట్ చేయడం వెనక ఆమె మరోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని ఫిలిం సర్కిల్‌లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు వనిత నాలుగో పెళ్లి గురించిన టాక్ రావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి వనిత నాలుగో పెళ్లి వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి