Pawan Kalyan meets Harish Shankar: పవర్ స్టార్ ను హరీష్ శంకర్ అలా చూపించబోతున్నాడా..?

|

May 16, 2021 | 9:15 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా  ఉన్నాడు.  ఇప్పటికే వకీల్ సాబ్ గా  ముందుకు వచ్చిన పవర్ స్టార్.

Pawan Kalyan meets Harish Shankar: పవర్ స్టార్ ను హరీష్ శంకర్ అలా చూపించబోతున్నాడా..?
Follow us on

Pawan Kalyan – Harish Shankar:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా  ఉన్నాడు.  ఇప్పటికే వకీల్ సాబ్ గా  ముందుకు వచ్చిన పవర్ స్టార్. సంచలన విజయాన్ని అందుకున్నారు . వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ లాయర్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దగ్గుబాటి రానా కూడా కనిపించనున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు అనే పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు పవన్.

ఈ సినిమాల తర్వాత మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ తో సినిమా అనగానే అభిమానుల్లో ఆనందం నెక్స్ట్ లెవల్ కు చేరింది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హరీష్ సినిమా దేశభక్తి నేపథ్యంలో ఉండనుందని కొందరు అంటున్నారు. మరికొంతమంది గబ్బర్ సింగ్ లాంటి మాస్ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన హరీష్ శంకర్ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరింత ఆలస్యం అవుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని అంటూ రకరకాలుగా పుకార్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులుగా ఈ షెడ్యూల్ లోనే నటించబోతున్నాడు. మొదలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా సన్నివేశాలను మరియు తండ్రి కొడుకుల మద్య సన్నివేశాలను చిత్రీకరిస్తారని ఆంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 movie : త్రిబుల్ ఫన్ తో రానున్న అనిల్ రావిపూడి.. ఈసారి సందడంతా ఆ హీరోదేనంట..

Akhanda Movie : కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న ‘అఖండ’… బాలయ్య సినిమాకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు..