Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ టీజర్‌లో రెచ్చిపోయిన ఈ బోల్డ్ బ్యూటీ ఎవరో తెలుసా? బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా

రాకింగ్ స్టార్ యష్‌ నటించిన లేటెస్ట్ సినిమా 'టాక్సిక్'. గురువారం (జనవరి 08) యశ్ పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హాలీవుడ్ లెవెల్ లో ఉన్న ఈ టీజర్ లో కొన్ని బోల్డ్ సీన్స్ చూసి యశ్ అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.

Toxic Movie: యశ్ టాక్సిక్ టీజర్‌లో రెచ్చిపోయిన ఈ బోల్డ్ బ్యూటీ ఎవరో తెలుసా? బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా
Yash Toxic Movie

Updated on: Jan 08, 2026 | 8:34 PM

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత కన్నడ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈమూవీలో భారీ తారాగణమే ఉంది. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి, తారా సుతారియా వంటి స్టార్స్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ నటీమణుల లుక్స్, పాత్రల పేర్లను చిత్రబృందం వెల్లడిస్తోంది. ఇక గురువారం (జనవరి 08) యశ్ పుట్టిన రోజు సందర్భంగా టాక్సిక్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హాలీవుడ్ లెవెల్ లో ఉన్న ఈ టీజర్ ఇప్పుడు యశ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఇందులోని బోల్డ్ సీన్స్ చూసి యశ్ అభిమానులే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇప్పటిదాకా యాక్షన్ హీరోగానే గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ రెచ్చిపోయి మరీ ఇంటిమేట్ సీన్స్ లో నటించాడు. కారులో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ టీజర్ తో పాటు ఇందులో యశ్ తో రొమాన్స్ చేసిన నటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

టాక్సిక్ టీజర్ విడుదలైన వెంటనే అందులో యష్‌ తో బోల్డ్‌గా కనిపించిన బ్యూటీ ఎవరబ్బా? అని నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఈ గ్లామర్ డాల్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ బోల్డ్ బ్యూటీ పేరు నటాలీ బర్న్. ఉక్రేనియన్-అమెరికన్ మోడల్ కమ్ నటి. గతంలో ది ఎక్స్ పాండబుల్స్ 3, డాన్‌హిల్‌, మెకానిక్‌ రెసురెక్షన్‌ తదితర హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఎక్కువగా బోల్డ్ మూవీస్‌కి, హర్రర్‌ చిత్రాల్లోనే ఆమె నటిస్తోంది. అలాగే ప్రముఖ మ్యాగజైన్‌లకు మోడల్‌గా కూడా వ్యవహరిస్తోది.

ఇవి కూడా చదవండి

నటాలీ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

కొన్ని రోజుల క్రితమే ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది నటాలి. ఈ మూవీలో ఆమె నటించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ నటాలీకి మంచి క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

 

టాక్సిక్ సినిమా టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.