సినీలోకం శోకసందంలో మునిగిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju Death )అనారోగ్యంతో కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణం రాజు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు మరణవార్తతో అభిమానులంతా ఒక్కసారిగా శోకంలో మునిగిపోయారు. తెలుగు సినిమా పై కృష్ణంరాజు తనదైన ముద్రవేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు రెబల్ స్టార్. నటనతో, డైలాగ్ డెలివరీతో కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదట్లో నెగిటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత ‘కృష్ణవేణి’ ‘భక్త కన్నప్ప’ ‘త్రిశూలం’ ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ‘పల్నాటి పౌరుషం’ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఇక కృష్ణంరాజు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. గోదావరి జిల్లా అంటేనే మర్యాదలు గుర్తొస్తాయి. ఇక కృష్ణంరాజు మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తన ఇంటికి వచ్చిన వారికీ మర్యాదలతో ముంచెత్తుతారు. అదే ప్రభాస్ కూడా అలవాటు చేసుకున్నారు. ఇక కృష్ణంరాజు మర్యాదల వెనక ఓ కథ కూడా ఉందట..ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అంతా.. కృష్ణంరాజు తన ఇంట్లో చేసే మర్యాదల గురించి పలు సందర్భాల్లో చెప్పారు. కృష్ణంరాజు ఈ మర్యాదలు అలవాటు చేసుకోవడం ఓకథే ఉందట. ‘కృష్ణంరాజు చిన్నతనంలో.. ఓ సారి ఓ పెద్దాయన ఇంటికి వస్తే ఆయన ముందు కాళ్ళు జాపుకుని తాపీగా కూర్చున్నారట. ఆ పెద్దాయన వెళ్లేంత వరకు కృష్ణం రాజు అలానే కుర్చున్నారట. దాంతో కృష్ణంరాజు నాన్నగారు కొరడాను తెప్పించి మరీ .. చితక్కొట్టి అసలు సంగతి చెప్పారట. ఇంటికి ఎవరు వచ్చినా ముందు అతిథి మర్యాదలు చేయాలి. నువ్వు ఏపనిలో ఉన్నా ఇంటికివచ్చిన వారిని ముందు గౌరవించాలి అని ఆయన తండ్రి గారు చెప్పారట. అప్పటి నుండీ కృష్ణంరాజు.. ఇంటికి ఎవరొచ్చినా మర్యాదలు చేస్తూనే ఉంటారట.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.