Ram Charan Shankar Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. దీనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ శంకర్ల సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్న విషయం తెలిసింది. అయితే తాజాగా ఈ మూవీని ఆపేయాలంటూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా… మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రామ్ చరణ్ సినిమా కంటే ముందు శంకర్.. కమస్ హసన్‌తో ‘ఇండియా 2’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్లో అగ్రిప్రమాదం జరగడం.. అందులో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. దీంతో ఈ మూవీ మేకర్స్ నష్టపరిహరాలు చెల్లించారు. ఈ ప్రమాదం తర్వాత శంకర్ మళ్లీ భారతీయుడు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయుడు 2 సినిమాకు తాము రూ.236 కోట్లు ఖర్చు చేశామని.. అంతేకాకుండా.. శంకర్‌కు పారితోషకంగా రూ.40 కోట్లలో రూ.14 కోట్లు చెల్లించామని ఆ సంస్థ తెలిపింది. ఇప్పుడు ఇండియన్ 2 సినిమా పూర్తి చేయకుండా.. కొత్త సినిమా ఒప్పుకోవడం సరైనది కాదని లైకా వెల్లడించింది. తమ సినిమా పూర్తిచేసేవరకు దర్శకుడు శంకర్‌కు స్టే ఇవ్వాలని హైకోర్టును కోరింది.
దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు డైరెక్టర్ శంకర్‌కు కొత్త సినిమాకు దర్శకత్వం వహించకుండా తాము స్టే ఇవ్వలేమని ఉత్తర్వులు తీర్పునిచ్చింది. దీంతో శంకర్, రామ్ చరణ్ సినిమాకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఈ సినిమాను జూలైలో సెట్స్ పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.
Also Read:
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ నటి.. ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు..