
Hero Vishal Tested Corona Positive : కరోనా ప్రపంచ వ్యాప్తంగా వీరవిహారం చేస్తోంది. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా హీరో విశాల్ కరోనా పాజిటివ్ అని తేలింది. విశాల్ తో పాటు అతని తండ్రి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
”అవును! అది నిజం. కరోనా టెస్టుల్లో మా నాన్నకు పాజిటివ్ అని తేలింది. ఆయనకు సహాయకుడిగా ఉన్నందుకు నాకూ కోవిడ్-19 సోకింది. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బందిపడ్డా. నా మేనేజర్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. మేమంతా ఆయుర్వేద మెడిసిన వాడి కేవలం వారం రోజుల్లో డేంజర్ నుంచి బయటపడ్డాం. ప్రజంట్ మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా” అని విశాల్ ట్వీట్ చేశారు.