Venkatesh : సీనియర్ హీరో వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..

| Edited By: Ravi Kiran

Nov 11, 2021 | 6:17 AM

సీరియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుర్రహీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటున్న వెంకీ సోషల్ మీడియాలో మాత్రం అంతగా యాక్టివ్ గా ఉండరు.

Venkatesh : సీనియర్ హీరో వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..
Venky
Follow us on

Venkatesh : సీరియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుర్రహీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటున్న వెంకీ సోషల్ మీడియాలో మాత్రం అంతగా యాక్టివ్ గా ఉండరు. చాలా రేర్ గా పోస్ట్ లు పెడుతుంటారు వెంకటేష్. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా వెంకటేష్ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇప్పటివరకు సినిమా అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేసే వెంకీ.. ఇటీవల ఎమోషనల్ పోస్ట్ లను షేర్ చేస్తున్నారు. ఎక్కువగా పాజిటివ్ కోట్స్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు వెంకీ.

తాజాగా వెంకటేష్ పోస్ట్ చేసిన ఓ కోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్ను ఇష్టపడే వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యిద్దు. నువ్వు అవసరమైన వారికి ఎప్పుడూ బిజీ అని చెప్పొద్దు. నిన్ను నిజంగా నమ్మే వారిని మోసం చేయకు. నిన్ను గుర్తుంచుకునే వారినెప్పుడూ మరచిపోకు’’ అని షేర్ చేశారు వెంకటేష్. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇటీవలే నారప్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్. ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తోపాటుగా దృశ్యం సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు వెంకీ. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :  

AP Film Exhibitors: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ ఎగ్జిబిట‌ర్ల సమావేశం.. ఆన్‌లైన్ టికెట్ విధానానికి అంగీకారం

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్