స్టార్ నటుల భార్యలు తమ భర్తలకు, పిల్లలకు కేర్‌టేకర్‌గా మిగిలిపోవడం మనం చూశాం. చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యి ఫ్యామిలీస్ తోనే గడిపేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ అయినప్పటికీ తమ భర్తల కోసం పిల్లల కోసం కెరీర్ ని త్యాగం చేసి సినిమా రంగానికి దూరంగా ఉన్న నటీమణులు చాలా మంది ఉన్నారు. అయితే స్టార్ నటుడు సూర్య తన భార్య కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఓ భార్య తన భర్త కోసం త్యాగం చేస్తుంది, కానీ సూర్య ఇప్పుడు తన భార్య కోసం ఓ త్యాగం చేశాడు. దీని గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
స్టార్ హీరో సూర్య చెన్నైలో పుట్టి పెరిగారు. చెన్నైలో డాక్టర్ రాజ్ కుమార్ ఇల్లు సూర్య ఇంటి పక్కనే ఉంది. నటుడిగా మారిన తర్వాత, సూర్య ముంబైకి చెందిన నటి జ్యోతికను వివాహం చేసుకున్నాడు. జ్యోతిక అప్పట్లో పెద్ద నటి. హిందీ, కన్నడతో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా నటించింది. సూర్యతో పెళ్లి తర్వాత జ్యోతిక ముంబై వదిలి చెన్నైలో స్థిరపడింది.
సూర్యను పెళ్లి చేసుకునే ముందు జ్యోతిక ముంబైలో రెండు దశాబ్దాలకు పైగా నివసించింది. అయితే సూర్య కోసం ముంబై వదిలేసింది. అయితే ఇప్పుడు జ్యోతిక కోసం చెన్నై వదిలి ముంబై షిఫ్ట్ అవుతున్నాడు సూర్య. ప్రస్తుతం సూర్య ముంబైలో ఉంటున్నాడు. అనుపమ చోప్రాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి సూర్య మాట్లాడుతూ, ‘జ్యోతిక రెండు దశాబ్దాలుగా ముంబైలో నివసించింది. నా కోసం ముంబై వదిలి వచ్చేసింది అయితే ఇప్పుడు జ్యోతిక కోసం నేను ముంబైకి షిఫ్ట్ అయ్యాను. ప్రతిసారీ భార్య ఎందుకు త్యాగం చేయాలి, ఈ ఒక్క చిన్న త్యాగం చేయాలనే ఉద్దేశ్యంతో ముంబైకి షిఫ్ట్ అయ్యాను’ అని సూర్య చెప్పాడు.
సూర్య భార్య జ్యోతిక కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే జ్యోతిక హిందీలో ‘శ్రీకాంత్’, ‘షైతాన్’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ‘డబ్బాకార్తెల్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత సంవత్సరం విడుదలైన కాదల్, అలాగే మలయాళ చిత్రం ది కోర్లో జ్యోతిక నటనకు ప్రశంసలు దక్కాయి.ది కోర్లో మమ్ముట్టి సరసన నటించింది. కాగా సూర్య నటించిన ‘కంగువ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.