సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. రోజు రోజుకు థియేటర్స్ పెరుగుతున్నాయి..

'నారీ నారీ నడుమ మురారి' విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని హీరో శర్వానంద్ అన్నారు. రోజురోజుకి థియేటర్స్ పెరుగుతున్నాయి. సినిమాకి మంచి లాంగ్ రన్ ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు యంగ్ హీరో శర్వానంద్. ఈ సినిమాకు రానున్న రోజుల్లో థియేటర్స్ పెరగనున్నాయని తెలిపారు శర్వా..

సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. రోజు రోజుకు థియేటర్స్ పెరుగుతున్నాయి..
Nari Nari Naduma Murari

Updated on: Jan 21, 2026 | 4:14 PM

చార్మింగ్ స్టార్ శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చార్మింగ్ స్టార్ శర్వా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సినిమా హిట్ కొట్టాలనే కష్టపడి పని చేస్తాం. అనుకున్న రిజల్ట్ రావడం చాలా ఆనందాన్నిచ్చిందని అన్నారు శర్వానంద్. అన్ని సినిమాలు కథ బాగుంటేనే చేస్తాం. అయితే అన్ని కుదిరినప్పుడే అది వర్క్ అవుట్ అవుతుంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో కలిస్తే బడ్జెట్లు పెరగవు. మంచి సినిమాలు బడ్జెట్లో తీయొచ్చు. ప్రతి సినిమా బాగా తీయాలని కూర్చుంటే అన్ని సినిమాలు బాగుంటాయి. అలాగే సంక్రాంతికి చివరిలో రావడానికి కారణం ఏంటి.? అని అడగ్గా.. ఆల్రెడీ నాలుగు సినిమాలు బుక్ అయ్యాయి. అయితే ఈ సంక్రాంతికి చాలా పెద్ద లాంగ్ వీకెండ్స్ కలిసి వచ్చాయి. 23 నుంచి 26 వరకు మళ్లీ పెద్ద వీకెండ్ వుంది. మేము కంటెంట్ నీ బలంగా నమ్మాము. సంక్రాంతి సీజన్లో ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆ నమ్మకం మాకు నిజమైందని అన్నారు.

ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతున్నాయి. సినిమాకి చాలా మంచి లాంగ్ రన్ ఉంటుంది.  ఈ సినిమా తొలి రోజు నుంచి చాలా నమ్మకం ఉంది. సినిమా ఎప్పుడు వచ్చినా సరే బ్లాక్ బస్టర్ అని మొదటి నుంచి చెప్తున్నాను. నాకు జాను సినిమా సమయంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. నిజంగా పెద్ద యాక్సిడెంట్ అది. తర్వాత నేను బరువు పెరిగాను. శ్రీకారం, ఆడవాళ్లకు జోహార్లు సినిమాల్లో నేను కాస్త లావుగా కనిపిస్తాను, ఆ లుక్ నాకే నచ్చదు. మనకు మనం నచ్చేలా ఉండాలని సంకల్పంతో మొదట వాకింగ్ చేయడం ప్రారంభించాను. తర్వాత రన్నింగ్, ఆ తర్వాత స్త్రెంత్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేశాను. తర్వాత యోగా చేశాను. అవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాయి. రాబోయే సినిమా బైకర్ లో రెండు రకాల క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫాదర్ రోల్. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో సూర్య గారు ఎలా కనిపిస్తారో అలాంటి క్యారెక్టర్. దాని కోసం చాలా కష్టపడ్డాను. అవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి ఉపయోగపడ్డాయి. నిజానికి బైకర్ సినిమా ముందుగా రావాలి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది రాలేదు. నేను ఒక జానర్ కి పరిమితం అవ్వాలని అనుకోలేదు. ప్రతి సినిమా కొత్తగా చేయాలి కొత్త కథలు చేయాలని తపన ఉంటుంది. అమ్మ చెప్పింది, అందరి బంధువయా, శతమానం భవతి.. ఇలాంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి దగ్గర కావడం బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..