Pawan Kalyan: రాజకీయాల్లోనూ  పవర్ స్టారే.. పవన్ కళ్యాణ్ పై నాని ఆసక్తికర కామెంట్స్

సరిపోదా శనివారం సినిమాతో నాని మంచి విజయాన్ని అందుకున్నాడు. సరిపోదా శనివారం సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక నాని ఇప్పుడు హిట్ 3 తర్వాత దసరా దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు.

Pawan Kalyan: రాజకీయాల్లోనూ  పవర్ స్టారే.. పవన్ కళ్యాణ్ పై నాని ఆసక్తికర కామెంట్స్
Nani, Pawan Kalyan

Updated on: Nov 23, 2024 | 10:04 AM

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వరుసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు నాని. దసరా సినిమా నుంచి మొదలు పెట్టి హాయ్ నాని, సరిపోదా శనివారం సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నాడు. నాని ప్రొడక్షన్ హౌస్ లో హిట్ సినిమా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. అలాగే ఈసారి నాని హిట్ 3 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సరిపోదా శనివారం సినిమాతో నాని మంచి విజయాన్ని అందుకున్నాడు. సరిపోదా శనివారం సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక నాని ఇప్పుడు హిట్ 3 తర్వాత దసరా దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మాస్ రా మావ..! స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా మహేష్ అన్న కూతురు

తాజాగా పవన్ కళ్యాణ్ గురించి నాని చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. నాని రీసెంట్ గా రానా హోస్ట్ గా చేస్తున్న షోకు హాజరయ్యారు. నాని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు ఆయన రాజకీయాల్లోనూ  పవర్ స్టారే అని నాని అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ.. రాజకీయాల్లోను బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

నాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్టార్ గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే..అలాగే రాజకీయాల్లోనూ అదే స్థాయిలో ఎదిగారు పవన్ కళ్యాణ్. అక్కడ కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. ఎంతో మందికి స్పూర్తినిచ్చారు అని నాని తెలిపింది. ఈ కామెంట్స్ పై రానా స్పందిస్తూ.. పవన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన నిజంగానే సూపర్ స్టార్ అని రానా అన్నారు. ఇక పవన్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ  ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ముందు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు, పవన్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us