Nani: ఆ దర్శకుడితో అప్పుడు కుదరలేదు.. ఇప్పుడు వస్తే వదులుకోను.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్

|

Dec 18, 2021 | 11:20 AM

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

Nani: ఆ దర్శకుడితో అప్పుడు కుదరలేదు.. ఇప్పుడు వస్తే వదులుకోను.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్
Nani '
Follow us on

Nani: న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. నాని నటించిన లాస్ట్ రెండు సినిమాలు ఓటీటీ లో విడుదలై దారుణంగా నిరాశ పరిచాయి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని నటించిన వి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆతర్వాత భారీ అంచనాల మధ్య ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యిన టక్ జగదీష్ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. దాంతో నానికి ఓటీటీ కలిసి రాలేదని టక్ గట్తిగా వినిపించింది. దానితో నాని అభిమానులంతా ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు నాని. అయితే దీనిలో శ్యామ్ పాత్రకోసం నాని బరువు పెరిగారన్న టాక్ వినిపించింది. శ్యామ్ పాత్ర 70 దశకంలో కథ జరుగుతున్నప్పుడు కనిపిస్తుంది. ఈ పాత్రలోనే నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. దానికోసం నాని బరువు పెరిగారని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీని పై నాని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినిమాకోసం బరువు పెరగలేదని అన్నాడు. అస్సలు అలాంటి ప్రయత్నం కూడా చేయలేదని.. గడ్డం తీసేయడంతో అలా కనిపించి ఉండొచ్చని నాని అన్నాడు. అలాగే తనకు నచ్చిన దర్శకుడు మణిరత్నం అని.. గతంలో ఆయనతో ఒక సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికే కుదరలేదని చెప్పాడు.ఇప్పుడు ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకొని అని అన్నాడు నాని.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: ప్రభాస్ సినిమా ప్రీరిలీజ్‌‌కు ముహూర్తం ఖరారు.. ఘనంగా రాధేశ్యామ్ ఈవెంట్..

Bangarraju Movie: వాసివాడి తస్సాదియ్యా.. అంటూ స్టెప్పులేస్తున్న నాగార్జున, నాగచైతన్య..

Bigg Boss