Ram Charan: “చరణ్ ఆ విషయం నాకు చెప్పలేదు”.. జిమ్ ట్రైనర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Aug 26, 2022 | 3:41 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు ఈ పేరుకు ఓ రేంజ్ ఉంది. మొన్నటివరకు టాలీవుడ్ లోనే ఎక్కువగా వినిపించిన ఈ పేరు.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో మారుమ్రోగుతోంది.

Ram Charan: చరణ్ ఆ విషయం నాకు చెప్పలేదు.. జిమ్ ట్రైనర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ram Charan
Follow us on

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ఇప్పుడు ఈ పేరుకు ఓ రేంజ్ ఉంది. మొన్నటివరకు టాలీవుడ్ లోనే ఎక్కువగా వినిపించిన ఈ పేరు.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో మారుమ్రోగుతోంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోని ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు చరణ్. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ వెనక్కి తిరిగి చూడలేదు. చరణ్ డాన్స్‌కు, నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ.. నటుడిగా ఎదుగుతున్నారు చరణ్. అలాగే చరణ్ ఎక్కడా కూడా మెగాస్టార్ తనయుడిని అనే గర్వాన్ని చూపించిన దాఖలాలు లేవు. వ్యక్తిగతంగానూ చరణ్ చాలా మంచోడు అంటూ అందరూ కొనియాడుతూ ఉంటారు.

తాజాగా చరణ్ గురించి ఆయన జిమ్ ట్రైనర్ ఆసక్తికర విషయలు బయట పెట్టాడు. ప్రముఖ జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతి మాట్లాడుతూ..  చిరుత మూవీ సమయంలో రామ్ చరణ్ కు ట్రైనింగ్ ఇచ్చా. చరణ్ ను ట్రైన్ చేసే సమయంలో ఆయన చిరంజీవి కొడుకని నాకు తెలియదు. తర్వాత ఒక ఫ్రెండ్ ఆయన చిరంజీవిగారి కొడుకు అని చెప్పారు. నేను వేలి మీరు మెగాస్టార్ కొడుకు అని చెప్పలేదు ఏంటి అని అడిగాను.. దానికి ఆయన చిన్న చిరునవ్వు నవ్వారు. చిరంజీవి కొడుకు అయినప్పటికీ చరణ్ ఎంతో వినయంగా ఉంటారు అని ట్రైనర్ కుల్దీప్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి