ఈ పాపను గుర్తు పట్టారా? ఒకప్పుడు రెస్టారెంట్లో డ్యాన్సర్‌గా పనిచేసింది.. ఇప్పుడేమో తెలుగులో క్రేజీ హీరోయిన్

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోందీ అందాల తార. ఓవైపు గ్లామరస్ పాత్రలు పోషిస్తూనే మరోవైపు నటనకు ఉన్న ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఆమె నటించిన ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ పాపను గుర్తు పట్టారా? ఒకప్పుడు రెస్టారెంట్లో డ్యాన్సర్‌గా పనిచేసింది.. ఇప్పుడేమో తెలుగులో క్రేజీ హీరోయిన్
Tollywood Actress

Updated on: Oct 29, 2026 | 8:52 PM

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. ఏపీలోనే పుట్టి పెరిగింది. ఉన్నత చదువులు చదివింది. అయిత నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అంతకు ముందు మోడల్ గానూ రాణించింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ ను గెల్చుకుంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొని ఫైనల్ కు చేరుకుంది. ఆపై నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట్లో సహాయక నటిగా చేసినా ఆ తర్వాత లీడ్ రోల్స్ చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ఉన్న ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేస్తోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయడానికి కూడా సై అంటోంది. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఈ బ్యూటీ ఏకంగా చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆపై అపోలో హాస్పిటల్స్ లో కూడా పనిచేసింది. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆమె మరెవరో కాదు పొలిమేర సినిమాల ఫేమ్ కామాక్షి భాస్కర్ల. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ బ్యూటీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘మా ఇంట్లో మిస్ ఇండియా పోటీల కోసం ట్రై చేస్తానన్నప్పుడు అస్సలు వద్దన్నారు. చైనాలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు నేను మా అమ్మకు చెప్పాను. మిస్ ఇండియా పోటీలలో పాల్గొనడానికి ఇండియా వద్దాం అనుకుంటున్నాను అని.. అయితే నా అసలు ప్లాన్ ఏమిటంటే.. చైనాలోనే ఉండి పీజీ కంప్లీట్ చేయాలని.. ఎందుకంటే అక్కడ టాప్ టాప్ టెన్ టాపర్స్ కు ఫ్రీ సీట్ ఇస్తారు. నేను ఎలాగో టాపర్ ని కాబట్టి.. మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసి మళ్లీ చైనాకు వెళ్లిపోతానని చెప్పాను. అయితే మిస్ ఇండియా పోటీలలో పాల్గొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనికి తోడు మా నాన్న ఒప్పుకోలేదు. పైగా ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని ముఖం మీదే చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక నేనే సొంతంగా డబ్బు రెడీ చేసుకుందామనుకున్నాను. దీంతో మెడిసిన్ చేస్తూనే రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ పార్ట్ టైం డ్యాన్సర్ గా పని చేసే దాన్ని. చైనా వాళ్లకు ఇండియన్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక వైపు మెడిసిన్ కోర్స్.. మరోవైపు డ్యాన్సర్ గా పార్ట్ టైం జాబ్.. రెండూ చేయలేక బాగా అలసిపోయేదాన్ని’

ఇవి కూడా చదవండి

కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫొటోస్..

‘ఉదయం 6 గంటలకు హాస్పిటల్లో డ్యూటీకి వెళ్లే దాన్ని. మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ ఉండదు. మధ్యలో 10 మినిట్స్ రౌండ్స్ తర్వాత మరో 10 మినిట్స్ తినడానికి మాత్రమే గ్యాప్ ఇచ్చేవాళ్లు. ఇక 12 గంటలకు డ్యూటీ దిగాక నా ఎలక్ట్రిక్ స్కూటీని ఉపయోగించుకొని నేరుగా రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ పార్ట్ టైం డాన్సర్ గా పని చేసేదాన్ని. 12:30 నుంచి 2:00 గంటల వరకు సుమారు నాలుగు పర్ఫామెన్స్ లు ఇచ్చేదాన్ని. ఆ తర్వాత వాళ్లే ఫ్రీగా భోజనం పెట్టేవాళ్లు. ఆ తర్వాత మళ్లీ 2:30 కు ఆస్పత్రికి వచ్చేదాన్ని. మళ్లీ రాత్రి 8 గంటల వరకు అక్కడే వర్క్ చేసేదాన్ని. తిరిగి 8 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు నాలుగు పర్ఫామెన్స్ లు ఇచ్చి, అక్కడ ఫ్రీ భోజనం తినేసి మళ్లీ ఆస్పత్రికి వెళ్లదాన్ని.  ఇలా సుమారు ఏడాది పాటు రోజుకు కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోయాను’ అంటూ తన కష్టం గురించి చెప్పుకొచ్చింది కామాక్షి. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

అగధ సినిమాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us