
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఠక్కున చూసి చాలా మంది పుష్ప అల్లు అర్జున్ కున్నారు. కానీ అక్కడ ఉన్నది టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. ఇప్పటివరకు లవ్, ఫ్యామిలీ, కామెడీ సినిమాల్లో లవర్ బాయ్ లా కనిపించిన ఈ హీరో ఇప్పుడు ఉన్నట్లుండి రా అండ్ రస్టిక్ లుక్ లోకి మారిపోయాడు. సేమ్ టు సేమ్ పుష్ప తరహాలోనే భారీగా జుట్టు, గడ్డం పెంచేసి ఊర మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం నెట్టింట వైరలవుతోన్న ఈ హీరో మరెవరో కాదు త్రిగుణ్ అలియాస్ అదితీ అరుణ్. గతంలో డియర్ మేఘా, ప్రేమదేశం, WWW, రీసెంట్ గా ఇషా తదితర యూత్ ఫుల్ అండ్ లవ్ స్టోరీల్లో స్మార్ట్ గా కనిపించిన అతను ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయాడు. త్రిగుణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా జంగా.. వెన్ లవ్ బర్న్స్.. శివ అవేకన్ అనేది ఈ మూవీ క్యాప్షన్. ఇవాళ (జూన్ 09) అతని పుట్టిన రోజు సందర్భంగా జంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇంత వరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి మాత్రం రా అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఊర మాస్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిగుణ్ లుక్ చాలా బాగుందంటూ కాంప్లిమెంట్స్ ఉన్నాయి.
ఇక జంగా సినిమా విషయానికి వస్తే.. కెవిన్ గడ్డం(శ్రీహరి) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రిగుణ్ సరసన నేహా పఠాన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి