Tollywood: అచ్చం అమూల్ బేబీలా ఉన్న బుజ్జాయి ఇప్పుడు పాపులర్ హీరోయిన్.. దేశంలోని ప్రతి ఇంట్లో ఈ బ్యూటీ ఫోటో ఉంటుంది.. ఎవరో గుర్తుపట్టండి..

|

Nov 27, 2022 | 8:29 PM

సినిమాల్లోకి రాకముందే యాడ్స్ వల్ల తెగ పాపులర్ అయ్యింది. సదరు బ్రాండ్స్ ఉత్పత్తులపై ఈ హీరోయిన్ పిక్ ఉంటుంది. దేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ క్యూటీ ఫోటో ఉంటుంది.

Tollywood: అచ్చం అమూల్ బేబీలా ఉన్న బుజ్జాయి ఇప్పుడు పాపులర్ హీరోయిన్.. దేశంలోని ప్రతి ఇంట్లో ఈ బ్యూటీ ఫోటో ఉంటుంది.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us on

ప్రస్తుతం సినీ ప్రముఖులు చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది స్టార్స్ బాల్యం జ్ఞాపకాలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో నెట్టింటిని షేక్ చేస్తుంది. ఆ అమ్మడు ఇప్పుడు దేశమంతా పాపులర్. సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ వల్లే క్రేజ్ సంపాదించుకుంది. పైన ఫోటోలో చూశారు కదా.. అచ్చం అమూల్ బేబీలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. అమాయకపు చూపులతో.. చిన్ని చిరునవ్వుతో ముద్దొచ్చేస్తున్న ఈ క్యూటీ.. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. మీకోసం మరో క్లూ. సినిమాల్లోకి రాకముందే యాడ్స్ వల్ల తెగ పాపులర్ అయ్యింది. సదరు బ్రాండ్స్ ఉత్పత్తులపై ఈ హీరోయిన్ పిక్ ఉంటుంది. దేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ క్యూటీ ఫోటో ఉంటుంది.

ఆ క్యూటీ లిటిల్ యువరాణి.. బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్. 1988లో నవంబర్ 28న హిమచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ లో జన్మించింది. ఈ అమ్మడు సినిమాల్లోకి రాకముందే ఫేమస్ స్కీన్ బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఉత్పత్తి యాడ్ లో తెగ పాపులర్ అయ్యింది. టెలివిజన్ లో యాడ్స్ ద్వారా కెరీర్ ఆరంభించిన యామీ గౌతమ్ ఆ తర్వాత నెమ్మదిగా వెండితెరపై సందడి చేసింది. కన్నడలో ఉల్లాస.. ఉత్సాహ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీలో ఏక్ నూర్, విక్కీ డోనర్, సనమ్ రే, కాబిల్, సర్కార్ 3 వంటి హిట్ చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

కేవలం హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. నువ్విలా.. గౌరవం.. యుద్ధం.. కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే అందం, టాలెంట్ ఉన్నా.. ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు రాలేదు. గతేడాది జూన్ 4న డైరెక్టర్ ఆదిత్య ధార్‏ను పెళ్లి చేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.