Tollywood: ఈ క్యూట్ చిన్నారి టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్.. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలే లేవు..

తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. కానీ అందం, ప్రతిభ ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. నటిగా మెప్పించినా.. అనుకున్నంత అవకాశాలు రావట్లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు పోషించేందుకు మాత్రం రెడీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?.. పైన ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి గురించే ఇదంతా. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: ఈ క్యూట్ చిన్నారి టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్.. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలే లేవు..
Actress
Follow us

|

Updated on: Apr 20, 2024 | 11:05 AM

నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు చాలా మంది. హీరోయిన్ కావాలని బోలేడన్ని ఆశలతో ప్రయత్నిస్తుంటారు. తీరా అవకాశం వచ్చాక తమను తాము నిరూపించుకుని వెండితెరపై తారగా వెలిగిపోతారు. మొదటి సినిమా హిట్టైతే ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటారు. అందం, అభినయంతో అలరిస్తూ బిగ్ స్క్రీన్ పై దూసుకుపోతుంటారు. కేవలం హీరోయిన్ గా మాత్రమే నటించేందుకు చాలా మంది తారలు రెడీగా ఉంటారు. కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అలాంటిది తొలి సినిమాలోనే పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ గా కనిపించింది. అయినప్పటికీ ఆమె నటించిన ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. కానీ అందం, ప్రతిభ ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. నటిగా మెప్పించినా.. అనుకున్నంత అవకాశాలు రావట్లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు పోషించేందుకు మాత్రం రెడీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?.. పైన ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి గురించే ఇదంతా. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?.. తనే పాయల్ రాజ్ పుత్.

కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచమయమైంది. ఇందులో ప్రియుడిని మోసం చేసిన ప్రియురాలి పాత్రలో పూర్తిగా విలనిజం ఉన్న హీరోయిన్ గా మెప్పించింది. తొలి సినిమాతోనే ఎంతో రిస్క్ చేసింది. ఒకే ఒక్క సినిమాతో అందరి చూపు తనవైపుకు తిప్పుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు మరిన్ని వస్తాయనుకున్నారు అంతా.. కానీ అందుకు భిన్నంగా ఈ బ్యూటీకి ఆశించిన స్తాయిలో ఆఫర్స్ రాలేదు. తీస్ మార్ ఖాన్, జిన్న, మాయ పేటిక చిత్రాల్లో కనిపించింది. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ లో మరో హిట్ అందుకోలేదు.

వెండితెరపై సినిమాలే కాకుండా ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తుంది. ఆహాలో త్రీ రోజేస్ వెబ్ సిరీస్ చేసి అలరించింది. అలాగే అనగనగా ఓ అతిథి సిరీస్ చేసింది. ఇక ఇటీవలే మంగళవారం సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం గోల్ మాల్, ఏంజెల్ చిత్రాల్లో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.