Tollywood: పాత్రకు ప్రాణం పెట్టేస్తాడు.. ఎలాంటి సాహసమైన ముందుంటాడు.. నట రాక్షసుడు ఎవరో తెలుసా ?..

అలాగే తనను తాను పూర్తిగా మార్చుకుని గుర్తుపట్టలేనంతగా మారిపోయి విమర్శకులనే ఆశ్చర్యపరిచాడు. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మెప్పించాడు. ప్రస్తుతం అతడి వయసు 58 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఓవైపు తనయుడు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ హీరో క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఎవరో గుర్తుపట్టగలరా ?

Tollywood: పాత్రకు ప్రాణం పెట్టేస్తాడు.. ఎలాంటి సాహసమైన ముందుంటాడు.. నట రాక్షసుడు ఎవరో తెలుసా ?..
Actor
Follow us

|

Updated on: Apr 17, 2024 | 6:33 PM

కథలో బలం ఉంటే ఎలాంటి సాహసమైన చేసేందుకు ముందుంటాడు. పాత్రకు ప్రాణం పోసే నటన అతడిది. వెండితెరపై సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో ఇప్పటివరకు అతడు చేసిన సాహసమైన పనులు ఎన్నో. పాత్ర కోసం బరువు పెరగడం అంతకు మించి బరువు తగ్గడం చేశాడు. అలాగే తనను తాను పూర్తిగా మార్చుకుని గుర్తుపట్టలేనంతగా మారిపోయి విమర్శకులనే ఆశ్చర్యపరిచాడు. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మెప్పించాడు. ప్రస్తుతం అతడి వయసు 58 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఓవైపు తనయుడు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ హీరో క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఎవరో గుర్తుపట్టగలరా ? అతడే కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఇండస్ట్రీలో సినిమా కోసం ఎంతటి త్యాగానికైనా తెగించడానికి ముందుండే నటులలో విక్రమ్ ఒకరు.

దాదాపు 15 ఏళ్లుగా సినీరంగంలో ఎన్నో విజయవంతమైన సినిమాలతో అలరిస్తున్నారు. సినిమాలే కాకుండా బుల్లితెరపై సీరియల్స్ కూడా చేశాడు. అలాగే ఎంతోమంది తారలకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ విక్రమ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అపరిచితుడు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. అజిత్ మొదటి సినిమా అమరావతి, బసమలర్ సహా సినిమాల్లో నటుడు అజిత్‌కి విక్రమ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే ప్రభుదేవాకు కూడా వాయిస్ అందించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలు పోషించిన విక్రమ్.. ఇప్పుడు తంగలాన్ సినిమాతో మరో సాహసం చేస్తున్నారు.

విక్రమ్ నటిస్తోన్న తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీపై క్యూరియాసిటి పెంచింది. అలాగే ఈ మూవీ కోసం విక్రమ్ దాదాపు 35 కేజీల బరువు తగ్గినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బరువు తగ్గేందుకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా చాలా కష్టపడ్డారని అన్నారు. విక్రమ్ బర్త్ డే సందర్భంగా తంగలాన్ మూవీ టీం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. విక్రమ్ మేకోవర్ కు సంబంధించిన వీడియోను అభిమానుల ముందుకు తెచ్చింది. ఆ వీడియోలో విక్రమ్ తన పాత్ర కోసం ఎంతగా కష్టపడ్డారో చూపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles