ఆయన నన్ను రూమ్‌కు వస్తావా? అని అడిగాడు: వరలక్ష్మి

TV9 Telugu

29 April 2024

ప్రస్తుతం కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పెషల్ రోల్స్ తోనూ, విలన్ గానూ మెప్పిస్తుందామె.

ఇటీవల హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జా సోదరిగా మెప్పించిన వరలక్ష్మి త్వరలోనే శబరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ మే3న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

దీంతో ప్రమోషన్ కార్యక్రాల్లో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. జయమ్మ కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన సినిమాను జనాల్లోకి తీసుకెళుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వరలక్ష్మి సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను అందరితో పంచుకుంది.

 'నేను నటిగా అప్పుడప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న రోజుల్లోనే ఒక టీవీ ఛానెల్ అధినేత నన్నుబయట కలుద్దామన్నాడు.

'ఎందుకు సార్‌ అని నేను అడిగిన వెంటనే.. ఏదైనా మాట్లాడుకుందాం రూమ్‌ బుక్‌ చేస్తాను కలుద్దాం'అని అన్నాడంటూ వాపోయింది వరలక్ష్మి.

స్టార్ హీరో కూతురైన తనకే ఇలా జరిగితే సామాన్య అమ్మాయిల పరిస్థితేంటి? అని ఆలోచించి అతనిపై కేసు పెట్టాను అని వరలక్ష్మి చెప్పుకొచ్చింది