అలాంటి సీన్లలో నటించను.. పేరెంట్స్ కూడా ఒప్పుకోరు: మృణాళ్

TV9 Telugu

29 April 2024

ప్రస్తుతం కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పెషల్ రోల్స్ తోనూ, విలన్ గానూ మెప్పిస్తుందామె.

 సీతారామంతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన మృణాళ్ ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది.

తెలుగులో హ్యాట్రిక్ సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న మృణాళ్ ఠాకూర్ చూడడానికి అచ్చం పక్కింటమ్మాయిలా కనిపిస్తుంది.

సాధారణంగా కథకి, పాత్రకి అవసరమైతే గ్లామర్‌ సన్నివేశాల్లో, ముద్దు సీన్స్‌లో నటించేందుకు సిద్ధమని చాలామంది హీరోయిన్లు అంటుంటారు.

అయితే తాను మాత్రం ఆ లిస్టులో లేదంటోంది మృణాళ్ ఠాకూర్. గ్లామర్ సన్నివేశాలు, కిస్సింగ్ సీన్లనో నటించేందుకు వెంటనే నో చెబుతానంటోంది.

'ఇంటెన్స్‌ కిస్సింగ్‌ సీన్స్, బెడ్‌ రూమ్‌ సన్నివేశాల్లో నటించడం నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇలాంటి వాటికి మొహమాటం లేకుండా నో చెబుతానంది మృణాళ్.

పైగా నేను ఇంటిమేట్ సీన్లు, కిస్సింగ్ సీన్లలో నటించేందుకు నా తల్లిదండ్రులు కూడా ఏ మాత్రం ఒప్పుకోరు. కాబట్టి నేను ఖరాఖండిగా నో చెబుతాను' అని అంటోందీ అందాల తార.

ఫ్యామిలీ స్టార్ సినిమాలో సందడి చేసిన మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది.