రామ్ చరణ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న అంజలి..

TV9 Telugu

29 April 2024

అంజలి హీరోయిన్ గా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కీలక పాత్రల్లోనూ నటిస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటుంది. 

తెలుగు అమ్మాయి అయినప్పటికీ కెరీర్ తమిళ్ సినిమాలతో మొదలు పెట్టింది. షాపింగ్ మాల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ అలరించింది. ఇక జర్నీ సినిమాతో మంచి విజయంతో పాటు గుర్తింపు సొంతం చేసుకుంది. 

తెలుగు, తమిళ్ భాషల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరిసింది. 

ఇక ఇటీవలే గీతాంజలి 2 అనే సినిమా చేసింది అంజలి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 

ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది అంజలి. 

ఇప్పుడు అంజలి ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే అంజలి తిరిగి ఫామ్ లోకి వస్తుంది .