30 April 2024

సాయి పల్లవి ఫస్ట్ రెమ్యునరేషన్.. న్యాచురల్ బ్యూటీ ఆస్తులు ఏంతంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఫిదా సినిమాతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది సాయి పల్లవి. ఫస్ట్ మూవీతోనే స్టార్డమ్ సొంతం చేసుకుని న్యాచురల్ బ్యూటీగా క్రేజ్ అందుకుంది. 

కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రస్తుతం అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఇప్పుడు తండేల్, రామాయణం చిత్రాల్లో నటిస్తుంది. 

ఇదిలా ఉంటే.. ఫిదా సినిమా కంటే ముందు మలయాళంలో ప్రేమమ్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. 

అయితే ప్రేమమ్ సినిమా కోసం సాయి పల్లవి కేవలం రూ.10 లక్షలు మాత్రమే తీసుకుందట. ఇక తెలుగులో ఫిదా సినిమాకు రూ. 15 లక్షల తీసుకుందట. 

 ఇక ఆ వెంటనే మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాకు ఏకంగా రూ. 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పటివరకు సాయి పల్లవి రూ. 40 కోట్ల ఆస్తులు సంపాదించిందట. 

అలాగే ఇప్పుడు ఒక్క సినిమాకు రూ. 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. 53 లక్షల విలువైన ఆడి క్యూ 3 కారు కలిగి ఉన్నట్లు సమాచారం. 

సాయి పల్లవి వద్ద మిత్సుబిషి లాన్సర్ ఎవో ఎక్స్, మారుతి సుజుకి నెక్సా వంటి కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అయినా సింప్లిసిటి అంటే ఇష్టమట. 

సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. అలాగే తక్కువ మేకప్, సింపుల్ లుక్‏తో కనిపిస్తూ వెండితెరపై మాయ చేస్తుంది న్యాచురల్ బ్యూటీ.