Google Year in Search 2022: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సాంగ్స్ ఇవే.. లిస్టులో పుష్ప సినిమా పాట..

|

Dec 08, 2022 | 8:59 AM

2022లో అత్యధికంగా గూగుల్‌లో శోధించిన పాటల జాబితా విడుదలైంది. ఇందులో అలీ సేథి, షెహ్ గిల్ పాడిన పసూరి పాట లిస్టులో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది.

Google Year in Search 2022: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సాంగ్స్ ఇవే.. లిస్టులో పుష్ప సినిమా పాట..
Pushpa Srivalli Song
Follow us on

Google Year in Search 2022: 2022లో అత్యధికంగా గూగుల్‌లో శోధించిన పాటల జాబితా విడుదలైంది. ఇందులో అలీ సేథి, షెహ్ గిల్ పాడిన పసూరి పాట లిస్టులో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది. విశేషమేమిటంటే ప్రపంచ వ్యాప్తంగాను నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక టాప్ సాంగ్స్ గురించి మాట్లాడితే, ఆసియా పాటలు అనేక గ్లోబల్ హిట్‌లుగా నిలిచాయి. పాకిస్థానీ గాయకుడు అలీ సేథీ వైరల్ పసూరి పాట బీటీఎస్.. బటర్‌ను అధిగమించి ఈ ఏడాదిలో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన పాటలలో నంబర్ వన్‌గా నిలిచింది. ఈ జాబితాలో రెండు భారతీయ పాటలు కూడా ఉన్నాయి.

పసూరి అనేది కోక్ స్టూడియో 14వ సీజన్‌లో విడుదలైన పంజాబీ పాట. ఈ పాటపై చాలా మంది టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు కూడా చేశారు. దీని కారణంగా ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి గాంచింది. అయితే బటర్‌కు కూడా చాలా ప్రజాదరణ ఉంది. బీటీఎస్ డైనమైట్ కూడా టాప్ టెన్ జాబితాలో నిలిచింది. అదే సమయంలో, ఇమాజిన్ డ్రాగన్ రెండు పాటలు ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత పేర్లలో అనిమే, బిలీవర్ ఉన్నాయి.

టాప్ టెన్‌లో రెండు భారతీయ పాటలు కూడా చోటు దక్కించుకున్నాయి. వీటిలో ఆదిత్య ఏఎస్ చాంద్ బలియాన్, మూడో స్థానంలో నిలిచింది. తెలుగులో విజయవంతమైన పుష్ప ది రైజ్‌లోని శ్రీవల్లి పాట 10వ స్థానంలో ఉంది. తెలుగు వెర్షన్‌ను సిద్ శ్రీరామ్ పాడగా, ఈ పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..