
టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో మద్దతు ఉందంటే ఆ సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. ముఖ్యంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆ మాస్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే, ఆ కథలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. వరుస పెట్టి భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్న ఆ స్టార్ నటుడు, తాజాగా ఒక చిన్న సినిమాను భుజాన వేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ నుంచి సమయం కేటాయించి ఆ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు. కేవలం స్టార్ సినిమాలే కాదు, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆయన సపోర్ట్ చేస్తున్న ఆ క్రేజీ మూవీ ఏంటి?
సినిమా రంగంలో ఎంతటి వారికైనా సరే ఒక మంచి కథ కనిపిస్తే దానిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు. సదరు స్టార్ హీరో కూడా సరిగ్గా ఇదే చేశారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ఎమోషనల్‌గా ‘ఛాంపియన్’ చిత్రానికి తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా వెనుక ఆ స్టార్ హీరోకు అత్యంత సన్నిహితులు ఉన్నారని సమాచారం. అందుకే తన మిత్రుల కోరిక మేరకు ఆయన ఈ సినిమా ప్రమోషన్లలో పాలుపంచుకున్నారు. కష్టపడి పని చేసే కొత్త తరాన్ని ప్రోత్సహించడం ఆ హీరోకు మొదటి నుంచి ఉన్న అలవాటు.
తన సహకారంతో ఒక చిన్న సినిమాకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్! టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా వచ్చిన ఛాంపియన్ సినిమాకు ఎన్టీఆర్ తన మద్దతు ప్రకటించారు. “నా స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఇప్పుడు వస్తున్న ఛాంపియన్ సినిమా వరకు.. స్వప్న సినిమా కొత్త గొంతుకలను ప్రోత్సహిస్తూనే ఉంది. వాళ్ళు చేసే ప్రతి సినిమా వెనుక సినిమాపై వారికున్న అమితమైన ప్రేమ కనిపిస్తూనే ఉంటుంది. స్వప్న దత్ నాకు ఎప్పుడూ అండగా ఉంటుంది.
From Student No. 1 to Champion, Swapna and Priyanka have highlighted and supported new and unique voices in Cinema creating a special brand at Swapna Cinema… Every movie they make reflects their love for cinema and the courage to attempt something new.https://t.co/KFQzfmx6uC
I…
— Jr NTR (@tarak9999) December 24, 2025
నేను కూడా స్వప్న టీమ్‌కు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూనే ఉంటాను. రోషన్, అనస్వర రాజన్, ప్రదీప్ అద్వైతంకు ఆల్ ది బెస్ట్. 2025 ముగింపులో ఒక మెమరబుల్ హిట్ గా ఈ సినిమా నిలువాలని ఆశిస్తున్నట్లు” ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది