
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న స్టార్స్ లో చాలా మంది కెరీర్ ప్రారంభంలో తీవ్ర ఇబ్బందులు పడిన వారే.
ఆర్థిక సమస్యల కారణంగ కుటుంబ పోషణ కోసం చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ప్రస్తుతం తెలుగులో స్టార్ నటుడిగా గుర్తింపు పొందిన ఈయన కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు. సినిమాల్లోకి రాకముందు కుటుంబ పోషణ కోసం ఈ నటుడు చాలా పనులే చేశారు. ఒకానొక దశలో అద్దంకి సెంటర్‌లో సిగరెట్లు, కిళ్లీలు కూడ అమ్మారు. ఆ తర్వాత రంగస్థల నటుడిగా సత్తా చాటారు. కొన్ని రోజుల పాటు బాపట్లలోని ‘సిటీ కేబుల్’ లో న్యూస్ రీడర్ గా పని చేశారు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టారు. సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే వెండితెరకు పరిచయం అయ్యారు. చాలా లేటు వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు ఇప్పుడు తెలుగులో మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్ గా మారిపోయారు. కేవలం విలనిజమే కాకుండా కామెడీ, సీరియస్, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తనదైన శైలిలో నటిస్తూ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఎంత ఎదిగినా, పాపులారిటీ వచ్చినా ఈ నటుడు చాలా సింపుల్ గా ఉంటారు. సినిమా ఈవెంట్స్ కి కూడా సింపుల్ గా పైజామా, లుంగీతో వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఆయన మరెవరో కాదు నటుడు అజయ్ ఘోష్.
అజయ్ ఘోష్ పూర్తి పేరు పత్తిపాటి అజయ్ ఘోష్. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా (అప్పటి ప్రకాశం జిల్లా) వేటపాలెం గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి పేరు పత్తిపాటి ఆదినారాయణ, తల్లి పేరు రామసీతమ్మ. రంగస్థలం నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న చితకా పనులు కూడా చేశారు. ఒకానొక దశలో అద్దంకి సెంటర్‌లో సిగరెట్లు, కిళ్లీలు కూడా అమ్మారట. ఈ విషయాన్ని అజయ్ ఘోషే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక 2010లో ప్రస్థానం సినిమాలో మొదటి సారిగా నటించారు అజయ్ ఘోష్. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు. అయితే రంగస్థలం సినిమా ఈ నటునికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే పుష్ప, వీరసింహారెడ్డి, బెదురులంక, మంగళవారం,గుంటూరు కారం, ఈగల్, ఫ్యామిలీ స్టార్, మ్యూజిక్ షాప్ మూర్తి , సరిపోదా శనివారం, గేమ్ ఛేంజర్, రీసెంట్ గా ఇరుముడి సినిమాల్లో అజయ్ ఘోష్ పోషించిన పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి.
Ajay Ghosh
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి