
సినిమా పాటలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే జానపదగీతాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుంటారు. జానపదగీతాలు ఎప్పుడూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఎన్నో ఫోక్ సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎంతో మంది ఫోక్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ఫోక్ సాంగ్స్ కూడా యూట్యూబ్ లో మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. దేశవిదేశాల్లోనూ మన ఫోక్ సాంగ్స్ మారుమ్రోగుతున్నాయి. తెలంగాణ భాషలో తెరకెక్కిన ఫోక్ సాంగ్స్ విశేష ఆదరణ పొందుతున్నాయి. సాంగ్స్ మాత్రమే కాదు ఆ సాంగ్ రాసిన వారు, నటించిన వారు , పాడిన వారు కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
అలాంటి వారిలో ఫోక్ డాన్సర్ నాగ దుర్గ ఒకరు. చూడచక్కని రూపంతో.. చక్కటి డాన్స్ తో కట్టిపడేస్తుంది ఫోక్ డాన్సర్ నాగ దుర్గ. ఈ చిన్నదానికి సినిమా హీరోయిన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ ఫ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఫోక్ సాంగ్స్ తో పాటు పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది ఈ చిన్నది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగ దుర్గ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తెలంగాణలో ఏటా ఘనంగా జరుపుకునే ప్రసిద్ధ బోనాల పండుగ కోసం 2025 సంవత్సరానికి నా పేరే ఎల్లమ్మ అనే ప్రత్యేక పాట రూపొందించారు. ఈ పాటలో నటించే అవకాశాన్ని నాగదుర్గ అందుకుంది. ఈ సందర్భంగా, నాగదుర్గ మాట్లాడుతూ, నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటి వంటి పదాలతో కూడిన ఈ పాటలో నటించడం పై ఆనందం వ్యక్తం చేసింది. ఈ అవకాశాన్ని ఒక పెద్ద అదృష్టంగా, ఓవర్ వెల్మ్డ్ అనుభూతిగా ఆమె భావించినట్లు తెలిపింది. నా పేరే ఎల్లమ్మ పాట తెలంగాణ బోనాల జాతరలో, ముఖ్యంగా ఎల్లమ్మ తల్లికి అంకితం చేశారు. ఈ పాట తెలంగాణ సంస్కృతి, జానపద సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. 2025 బోనాల ఉత్సవాలకు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే ఈ సాంగ్ 102 మిలియన్ కు మించి వ్యూస్ సొంతం చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.