
ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా తెలంగాణ ఫోక్ సాంగ్స్ హావా నడుస్తుంది. కొన్ని పాటలు విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరికొన్ని మాత్రం సంవత్సరాలు గడిచినా ఏమాత్రం తగ్గని క్రేజ్ తో ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. మరో నాలుగైదు రోజుల్లో ఆషాడమాసం ప్రారంభం కానుంది. అంటే.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాల సందడి మొదలుకానుంది. జూలై 19 నుంచి రాష్ట్రంలో బోనాలు, అమ్మవారి ఊరేగింపు పండగలు, జాతరలు సాగనున్నాయి. ముఖ్యంగా బోనాల సందడి మొదలైందంటే.. సరికొత్త ఫోక్ సాంగ్స్ అదరగొడుతుంటాయి. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ నెట్టింట దుమ్మురేపుతున్నాయి. గతేడాడి బోనాల పండుక్కి వచ్చిన నా పేరే ఎల్లమ్మా.. జోగురాలమ్మ పాటలు ఏ స్థాయిలో మెప్పించాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ నటించిన సరికొత్త బోనాల పాట యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఓవైపు సినిమాల్లో కథానాయికగా వరుస అవకాశాలు అందుకుంటున్న నాగదుర్గ.. ఇటు తనకు పేరు తెచ్చిపెట్టిన జానపద పాటల్లోనూ నటిస్తుంది. తాజాగా ఆమె నటించిన ఎల్లమ్మ సాంగ్ ఇప్పుడు తెగ మారుమోగుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..
నాగదుర్గ నటించిన లేటేస్ట్ ఫోక్ సాంగ్ “లల్లాయిలే ఎల్లమ్మ..” ఈ పాటను తెలంగాణ సంస్కృతి, బోనాల పండుగ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ఎంతో కలర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఇక ఎప్పటిలాగే ఈ పాటలో నాగదుర్గ తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో, ఎనర్జిటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. డీజే మిక్స్, తీన్‌మార్ బీట్స్‌తో సాగే ఈ సాంగ్ ముఖ్యంగా పండుగ సీజన్‌లో డీజేలలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ పాటను ఫోక్ సింగర్ ప్రభ అద్భుతంగా పాడగా.. లల్లాయిలే మహేష్ గౌడ్ రాశారు. నరేంద్ర శర్మ సంగీతం అందించారు.
ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?
జూలై 7న విడుదలైన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. గతేడాది నాగదుర్గ నటించిన నా పేరే ఎల్లమ్మ పాట సైతం అటు యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. ఈ పాటకు ఇఫ్పటివరకు 111 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి ఎల్లమ్మ పాటతో బోనాల పండక్కి అలరించేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఈ పాటను మీరు విన్నారా.. ?
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..