Janu Lyri : 2000 ఫోక్ సాంగ్స్ చేశాను.. ఒక్కో పాటకు రెమ్యునరేషన్ ఎంతంటే.. ఫోక్ డ్యాన్సర్ జాను లిరి..

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ జానపద పాటలకు తనదైన శైలిలో స్టెప్పులేస్తూ, కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న డ్యాన్సర్లలో జాను లిరి ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలను, తన పారితోషికం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Janu Lyri : 2000 ఫోక్ సాంగ్స్ చేశాను.. ఒక్కో పాటకు రెమ్యునరేషన్ ఎంతంటే.. ఫోక్ డ్యాన్సర్ జాను లిరి..
Janu Lyri

Updated on: May 08, 2026 | 3:02 PM

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది డ్యాన్సర్ జాను లిరి. ఎన్నో హిట్ పాటలలో నటించి ఢీ షో వరకు వెళ్లి విజేతగా నిలిచింది. అయినప్పటీకు తనకు లైఫ్ ఇచ్చిన ఫోక్ సాంగ్స్ మాత్రం వదల్లేదు. ఇప్పటికీ పల్లె పాటలతో కుర్రకారును ఊర్రూతలూగిస్తుంది. జాను లిరి కెరీర్ అంత సులభంగా సాగలేదు. ఆమె మొదటిసారి ఒక జానపద పాటకు డ్యాన్స్ చేసినప్పుడు అందుకున్న పారితోషికం కేవలం 1000 రూపాయలు. ఆ రోజుల్లో అవకాశాల కోసం ఎంతో ఎదురుచూడాల్సి వచ్చేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె గుర్తు చేసుకున్నారు. కేవలం డబ్బు కోసం కాకుండా, డ్యాన్స్ పై ఉన్న మక్కువతో ఆమె అనేక చిన్న చిన్న ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటివరకు దాదాపు 2000కు పైగా జానపద పాటల్లో నటించానని చెప్పుకొచ్చింది. పల్లెటూరి వాతావరణం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆమె చేసే డ్యాన్స్ వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. నిరంతర కృషి, అంకితభావంతో ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. ఒకప్పుడు వెయ్యి రూపాయలతో మొదలైన ఆమె రెమ్యునరేషన్, ఇప్పుడు ఒక్కో పాటకు 20,000 రూపాయల వరకు తీసుకుంటానని తెలిపింది. డ్యాన్స్ పట్ల ఆమెకు ఉన్న అంకితభావం ఆమెను ‘ఢీ’ వంటి పెద్ద షోలలో విన్నర్‌గా నిలబెట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఆమె, తనదైన డ్యాన్స్ స్టైల్ తో పాపులర్ అయ్యింది. మంగ్లీ పాడిన ‘ఆడ నెమలి’ (కనకవ్వ) సాంగ్‌లో జాను చేసిన డ్యాన్స్‌కు విశేష స్పందన లభించింది; ఈ వీడియోకు యూట్యూబ్‌లో 15 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రారంభంలో వేదికలపై డ్యాన్స్ చేసినప్పుడు కేవలం రూ. 1,000 – రూ. 1,500 పారితోషికం తీసుకునేవారు. ప్రస్తుతం ఒక్కో పాటకు రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us