
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’. దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా రామాయణ షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. సోమవారం (అక్టోబర్ 05) సాయంత్రం ఫిల్మ్ సిటీలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియో వెనుక భాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు వంద అడుగుల తాత్కాలిక సెట్‌లోని పీసీఆర్ యూనిట్‌లో ఈ మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ వైరింగ్, కేబుల్స్, తలుపులు, చెక్కపలకలు, ఏసీ యూనిట్లు, బాంబులు, ప్లాస్టిక్ సామగ్రి, సౌండ్ సిస్టమ్స్, షూటింగ్ పరికరాలు ఈ అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ముంబై ఫైర్ సిబ్బంది, పోలీసులు, బీఎంసీ వార్డ్ కంట్రోల్, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా, చుట్టుపక్కల సెట్లలో ఉన్న నటీనటులు, సిబ్బంది, ఇతర ఉద్యోగులను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ వెంటనే సహాయక చర్యలు చేపట్టి సకాలంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ముంబై ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
కాగా అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చాలా దగ్గరలో ‘ఎమ్‌టివి హస్ల్’ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్ కోసం రాపర్ బాద్షా సెట్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు, స్క్వాడ్ బాస్‌లు, జ్యూరీ, షో ఫైనలిస్టులు కూడా అక్కడే ఉన్నారు. అలాగే ‘పతి పత్ని ఔర్ పంగా’ షో సెట్ ‘ఎమ్‌టివి హస్ల్’ సెట్‌కు సరిగ్గా పక్కనే ఉంది. ఇది కాకుండా, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా కొంత దూరంలో ఒక యాడ్ షూట్ కోసం హాజరైనట్లు చెబుతున్నారు. కాగా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అన్ని సెట్‌లలో చిత్రీకరణను తక్షణమే నిలిపివేశారు. ఆ ప్రాంతంలో భద్రతా జాగ్రత్తలు తీసుకున్నారు.
BREAKING 🚨🚨🚨
Watch…
Massive fire at #RanbirKapoor and #Yash starrer #Ramayana set at Mumbai’s Film City ⚠️
A Level-I fire broke out at a temporary set in Mumbai’s Film City, where Ranbir Kapoor and Sai Pallavi’s Ramayana is being shot. The blaze also reportedly affected nearby Pati Patni Aur Panga 2 and MTV Hustle 5 sets. No injuries were reported.
Reportedly none of the actors were present at the spot while the incident occurred.
— Always Bollywood (@AlwaysBollywood) October 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి