భయంతో ప్యాంట్ తడిసిపోవడం ఖాయం..! దైర్యముంటేనే చూడాల్సిన సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలో ప్రతి శుక్రవారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుం ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జోనర్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర బాషల సినిమాలను కూడా ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

భయంతో ప్యాంట్ తడిసిపోవడం ఖాయం..! దైర్యముంటేనే చూడాల్సిన సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie

Updated on: Nov 11, 2025 | 12:46 PM

ఓటీటీలో హారర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అసలు హారర్ సినిమాను ఇష్టపడని వారు ఉండరు.. అయితే ఓటీటీల పుణ్యమా అని ఎన్నో రకాల హారర్ సినిమాలు ప్రేక్షకులను భయపెడుతున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలన్నిటిలో ఈ సినిమా అత్యంత భయంకరమైన సినిమా ఇది. ఈ హారర్ సినిమా చూస్తే ఒణుకుపుట్టడం ఖాయం.ఇక సినీ లవర్ ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో హారర్ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో రకాల హారర్ సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ సినిమాను దైర్యం ఉంటేనే చూడాలి.. ఒంటరిగా చూస్తే భయంతో జ్వరం రావడం ఖాయం. అసలు ఈ సినిమా ఏంటంటే..

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఇఖ్బాల్ (Iqbal) అనే టీనేజ్ బాయ్ చుట్టూ తిరుగుతుంటుంది. అతను ఒక అప్రెంటిస్ ఫెయిత్ హీలర్ అలాగే ఎక్సార్సిస్ట్. అతనికి ప్రివ్యూస్ (మరణించిన వారి దృశ్యాలు చూడగల సామర్థ్యం) అదేవిధంగా సూపర్‌నాచురల్ పవర్స్ ఉంటాయి. తన తల్లి మరణం తర్వాత, అతను తన అబిలిటీస్‌ను మరచి సాధారణ టీనేజర్ గా  జీవించాలని ప్రయత్నిస్తాడు. కానీ, అతని అపార్ట్‌మెంట్‌లో ఒక మాలిషియస్ స్పిరిట్ (చెడు ఆత్మ) తిరుగుతుంటుంది. దీనితో అతను తన పవర్స్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ డార్క్ సీక్రెట్స్ కూడా వెలుగులోకి వస్తాయి. ఆతర్వాత ఏమైంది.? ఆ పిల్లడు ఆ చేడు ఆత్మ నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది కథ. ఈ సినిమాలో భయంకరమైన సన్నివేషాలు చాలా ఉంటాయి.

ఈ సినిమా పేరు బ్లడ్ ఫ్లవర్. ఇదొక హారర్ మూవీ. 2022లో విడుదలైన ఈ హారర్ సినిమాకు డైన్ సైడ్ దర్శకత్వం వహించగా, ఇందులో ఇడాన్ ఐడాన్, బ్రోంట్ పాలరే, రెమీ ఇషాక్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం షడ్డర్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.