టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా నేచురల్ గా మన ఇంట్లోనో.. లేక మన వీదిలోనో జరిగే కథలా అనిపిస్తాయి శేఖర్ కమ్ముల సినిమాలు. ఇక అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములతో డిఫరెంట్ స్టైల్.. ఈ క్రమంలోనే శేఖర్ నుంచి వచ్చిన మంచి కాఫీలాంటి సినిమా ఆనంద్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది. రాజా, కమిలిని ముఖర్జీ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లు గా నటించిన చిన్నారి గుర్తుందా.. పై ఫొటోలో కనిపిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
ఆ చిన్నారి పేరు భకిత. ఆమె వయసు ఇప్పుడు 26ఏళ్లు. ఈ అమ్మడు సినిమాలకు తగ్గించింది. ఆమె ప్రస్తుతం సమాజ సేవలో బిజీగా ఉంది. భకిత 17 సంవత్సరం నుండే మహిళల హక్కుల కోసం, సమాజంలో ఆడవాళ్లకు మగాళ్ల మాదిరిగా సమన హక్కులు కల్పించాలని..అలాగే ఆడపిలల్లపై దాడులు ,అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని భకిత పోరాటం చేస్తోంది.
ఇప్పుడు ఈ అమ్మడు చాలా అందంగా ఉంది కానీ ఆమె సినిమాల్లో ప్రయత్నించకుండా సమాజ సేవ చేస్తోంది. తాజాగా అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భకిత లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.