Shalini Pandey: ద్యావుడా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీకి ఏమైంది ?.. షాలిని ఇంత మారిపోయిందేంటీ..

'అర్జున్ రెడ్డి' హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు. అంతగా ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది షాలిని. సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది.

Shalini Pandey: ద్యావుడా.. అర్జున్ రెడ్డి బ్యూటీకి ఏమైంది ?.. షాలిని ఇంత మారిపోయిందేంటీ..
Shalini Pandey

Updated on: Feb 18, 2024 | 12:10 PM

ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమా చేసి ఊహించని రేంజ్‏లో ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. కానీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండానే సినీ పరిశ్రమకు దూరమైపోతారు. అందం, అభినయంతో మెప్పించినా.. అవకాశాలు మాత్రం అందనంత దూరంలోనే ఉంటాయి. అలాంటి వారి జాబితాలో షాలిని పాండే ఒకరు. ఈ బ్యూటీ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు. అంతగా ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది షాలిని. సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ షాలిని మాత్రం ఇప్పటికీ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా.. కానీ అలా జరగలేదు. ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఆ తర్వాత పరిశ్రమకు దూరమయ్యింది.

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది షాలిని. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, జిమ్ వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. అయితే ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొంది షాలిని. ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. అయితే అందులో షాలిని న్యూలుక్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ నిండుగా.. ఎంతో అందంగా కనిపించే షాలిని.. ఇప్పుడు మాత్రం బక్కచిక్కిపోయి అసలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. దీంతో నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. షాలినికి ఏమైందీ ?.. అసలు నిన్ను ఇలా ఊహించలేము.. ఫిట్ నెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి తర్వాత కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించింది. అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం, మహారాజా చిత్రాల్లో నటించింది. అటు హిందీలో మహారాజా సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు షాలిని. ప్రస్తుతం ఈ బ్యూటీ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. తనకు తెలుగు సినిమాలు చేయాలని ఉందని.. ఎందుకంటే తన ఫస్ట్ మూవీ తెలుగు అని.. ఆ చిత్రాన్ని అడియన్స్ ఎంతో ఆదరించారని తెలిపింది. ప్రస్తుతం షాలిని ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.