
అందాల సినిమా భామలకు సంబంధించిన ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా నిత్యం షేర్ చేస్తూ ఉంటారు కొందరు. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడి ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటోలో కురులతో మొహాన్ని దాచి నవ్వులు రువ్వుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ క్రేజ్ సొంతం చేసుకుంది. బోల్డ్ సీన్స్ లోనూ ఏమాత్రం మొహమాట పడకుండా రెచ్చిపోయింది ఈ భామ ఆమె ఎవరో కాదు..
తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మల్లో షాలిని పాండే ఒకరు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ భామ. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. కుర్రకారును తన క్యూట్ నెస్ తో కట్టిపడేసింది. మనకు కూడా ఇలాంటి లవర్ ఉండాలి అనేలా యువతను ఆకట్టుకుంది ఈ చిన్నది.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈ భామ కు పెద్దగా ఆఫర్లు రాలేదు. కళ్యాణ్ రామ్ నటించిన 180 సినిమాలో నటించింది. అలాగే రాజ్ తరుణ్ తో కలిసి ఒక సినిమా చేసింది. వీటితో పాటు అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది ఈ భామ. గతంలో బాబ్లీ గా ఉన్న ఈ భామ ఇప్పుడు సన్నగా మరి ఆకట్టుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..