ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చైల్డ్ హుడ్ ఫొటోలో ఉన్న హీరో, హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?
Tollywood

Updated on: Oct 01, 2025 | 12:05 PM

ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఎవరో గుర్తు పట్టారా? ఈ ఇద్దరు పిల్లలు ఒక స్టార్ నటుడి పిల్లలు. ఇప్పుడు పెరిగి పెద్ద వారయ్యారు. తండ్రి బాటలోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కుమారుడు ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా డ్యాన్సులు, ఫైట్స్ లో ఇరగదీశాడన్నకాంప్లిమెంట్స్ వినిపించాయి. ఇక అన్న సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది చెల్లెలు. దగ్గరుండి ప్రమోషన్ కార్యక్రమాలను చూసుకుంది. ఇప్పుడు ఆమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇటీవలే బ్రహ్మా ఆనందం సినిమాలో ఓ పాత్రలో తళుక్కుమన్న ఆమె ఇప్పుడు కథానాయికగా వెండితెరకు పరిచయం కానుంది. ఇంతకీ వీరెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. వీరు మరెవరో కాదు..

ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ పిల్లలు చంద్ర హాస్, దివిజా ప్రభాకర్. ఇది వారి చిన్ననాటి ఫొటో. దివిజా ప్రభాకర్ హీరోయిన్ గా ఇటీవలే కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా చంద్ర హాస్ ఇప్పటికే రామ్ నగర బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అతని యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ కు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు కాయిన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు దివిజా ప్రభాకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల రిలీజైన బ్రహ్మా ఆనందం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన ఆమె ఇప్పుడు కథానాయికగా అదృష్టం పరీక్షించుకోనుంది.

‘హే చికీతా’ పేరుతో తెరకెక్కిన ఈ ప్రేమ కథా చిత్రంలో ‘వైఫ్ ఆఫ్’ ఫేమ్ అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్నాడు. తన్మయి మరో హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ గరుడ వేగ అంజి ఈ సినిమాను అశోక ఆర్‌ఎన్‌ఎస్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రంతో ధనరాజ్ లెక్కల దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టనుంది. ఈ సినిమాలో పృథ్వీ రాజ్, ప్రభాకర్, వీర శంకర్, బలగం సుజాత, అంజి మామ, గంగవ్వ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.