Jai Bolo Telangana : అబ్బా వాటే మేకోవర్.. జై బోలో తెలంగాణ సినిమా హీరోయిన్ ఇప్పడెలా ఉందో చూశారా?

తెలుగులో ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తొలి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న కొందరు హీరోయిన్స్ ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకున్నారు. కానీ మరికొందరు మాత్రం అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమైపోయారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. ఇంతకీ ఆమె మీకు గుర్తుందా.. ?

Jai Bolo Telangana : అబ్బా వాటే మేకోవర్.. జై బోలో తెలంగాణ సినిమా హీరోయిన్ ఇప్పడెలా ఉందో చూశారా?
Meera Nandan

Updated on: Feb 22, 2026 | 4:44 PM

జై బోలో తెలంగాణ.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన పేరు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 2011లో వచ్చిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు, స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలు పోషించారు. డైరెక్టర్ ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహాలక్ష్మీ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఇందులో మీనా నందన్, సందీప్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అలాగే అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ పాటలు అందించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది హీరోయిన్ మీరా నందన్. సహజ నటన, న్యాచులర్ లుక్స్ తో కట్టిపడేసింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కానీ ఆమె మాత్రం చాలా సెలక్టివ్ మూవీస్ చేసింది. అలాగే మలయాళంలో కొన్ని టీవీ షోస్ చేసింది. సినిమాల్లోకి రాకమందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2008లో ముల్లా అనే సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వాల్మీకి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. జై బోలో తెలంగాణ తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. 2014లో తన స్నేహితుడు అకౌంటెంట్ శ్రీజును వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ప్రస్తుతం తన భర్తతో కలిసి దుబాయ్ లో ఉంటున్న మీరా నందన్.. అక్కడే మలయాళీ రేడియో స్టేషన్ లో జాకీగా పనిచేస్తున్నారు. అలాగే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us