Arundhati Movie: ఓడియమ్మా.. గత్తరలెపుతోన్న అరుంధతి డ్యాన్స్ టీచర్.. ఫోటోస్ చూస్తే వెర్రెక్కిపోవాల్సిందే..

|

Jan 11, 2025 | 12:42 PM

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో చాలా మంది అమ్మాయిలు సినీరంగంలోకి అడుగుపెడతారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. అందం, అభినయంతో హీరోయిన్లుగా వరుస ఆఫర్స్ అందుకుంటారు. మరికొందరు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఒక్కసారిగా ఫేమస్ అవుతుంటారు.

Arundhati Movie: ఓడియమ్మా.. గత్తరలెపుతోన్న అరుంధతి డ్యాన్స్ టీచర్.. ఫోటోస్ చూస్తే వెర్రెక్కిపోవాల్సిందే..
Arundhati
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ అరుంధతి. దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2009లో విడుదలైన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ చిత్రానికి అవార్డులు, రివార్డులు దక్కాయి. మొత్తం ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాలను అందించింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అనుష్క పేరు మారుమోగింది. ఆమె నటనకు అభిమానులు, సినీ విమర్శకులు ఫిదా అయ్యారు. ఈ ఒక్క సినిమా ఆమె కెరీర్‏ను మార్చేసింది. అరుంధతి మూవీతో స్టార్ డమ్ అందుకున్న అనుష్క ఆ తర్వాత తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

ఈ సినిమాలో అనుష్కతోపాటు సోనూసూద్ నటనకు సైతం అడియన్స్ ఆశ్చర్యపోయారు. పశుపతి పాత్రలో జీవించేశారు. అలాగే షియాజీ షిండే, మనోరమ, కైకాల సత్యనారాయణ, దివ్య నగేష్, అర్జున్ బజ్వా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో అరుంధతి చిన్నప్పటి డ్యాన్స్ టీచర్ గా నటించిన నటి గుర్తుందా..? ఆమె మరణంతోనే సినిమా స్టోరీ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఈ చిత్రంలో కనిపించింది కాసేపు అయినా.. అందంతో మైమరపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ఆ నటి పేరు లీనా సిద్ధు.. అరుంధతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

లీనా సిద్ధు.. అచ్చమైన తెలుగుమ్మాయి. తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. చార్మీ కౌర్ నటించిన కావ్య’s డైరీ, లంక, హ్యాపీ హ్యాపీగా వంటి చిత్రాల్లో కనిపించింది. ఇండస్ట్రీలోకి రావడానికి ముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..