
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తోన్న సినిమా యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇక అడియన్స్ ముందుకు రాబోతున్న యాత్ర 2 చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నారు. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిస్థితుల.. వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి డైరెక్టర్ మహి వి రాఘవ్ తెలిపారు. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా యాత్ర 2 నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
యాత్ర 2 సినిమాను మొత్తం రూ. 50 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్నారట. ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ కంటే రెమ్యునరేషన్స్ ద్వారానే ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జీవాకు రూ. 8 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మమ్ముట్టికి రూ. 3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కలిసి పది కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా అందరికి తెలిసిన కథే అని.. ఎలా తీశాం.. ఏ ఎమోషనల్ నడిపించామన్నది ఎవరికీ తెలీదు. ఎన్నో ఎమోషనల్ సీన్స్, తెలియని అంశాలు ఈ మూవీలో ఉంటాయి. మేం చెబుతున్నది నిజమా ?.. అబద్ధమా ? అనేది పక్కనపెడితే.. తండ్రికి కొడుకు వచ్చిన మాట చుట్టూనే ఈ కథ ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో ఎవర్నీ కించపరిచేలా ఉండవని.. ఏ పార్టీని విలన్ గా చూపించలేదని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ భావోద్వేగ ప్రయాణాన్ని మాత్రమే చూపించామని అన్నారు డైరెక్టర్ మహి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.