
పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? ఈ కుర్రోడు తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే. కానీ అమ్మాయిల్లో పిచ్చ ఫాలోయింగ్.. విపరీతమైన పాపులారిటీ. తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సినీ ఇండస్ట్రీకి చైల్డ్ యాక్టర్‌గా పరిచయమై.. ఇటీవల హీరోగా టాలీవుడ్‌లోకి పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ దక్కించుకున్నాడు. అలాగే తోపు యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. అతడెవరో ఇప్పటికైనా కనిపెట్టారా.? లేదా మమ్మల్ని చెప్పేయమంటారా.? మీకో క్లూ ఇస్తున్నాం. ఈ హీరో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. కానీ బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మీరు గుర్తుపడితే ఓకే..! లేకపోతే మేమే చెప్పేస్తున్నాం..
ఆ చిన్నోడు ఎవరో కాదు పంజా వైష్ణవ్ తేజ్. మనోడికి చిరంజీవి మామయ్య అవుతారు. అలాగే హీరో సాయి ధరమ్ తేజ్ అన్నయ్య. 2003లో ‘జానీ’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత ‘శంకర్ దాదా MBBS’, ‘అందరివాడు’ చిత్రాలలో తన నటనకు గానూ మంచి మార్కులు సంపాదించాడు.
ఇక 2021లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయ్ సేతుపతి లాంటి అగ్ర నటుడు ఉన్నప్పటికీ.. తన నటనతో అందరినీ మెప్పించి.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్నాడు. అనంతరం ‘కొండపాలం’, ‘రంగ రంగ వైభవంగా’ లాంటి మూవీస్‌లో నటించాడు. కాగా, ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్.. నూతన దర్శకుడు శ్రీకాంత్.ఎన్. రెడ్డితో ఓ మాస్ చిత్రం చేస్తున్నాడు.