Mathu Vadalara 2: రియా దొరికేసిందిరోయ్..! మత్తువదలరా 2 భామ మాములుగా లేదుగా..

మత్తువదలరా 2 సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో శ్రీ సింహ, సత్య ప్రధాన పాత్రలో నటించారు. అలాగే వెన్నెల కిశోర్, ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ స్క్రీన్ ప్రజన్స్ చాలా అట్రాక్ట్ చేసిందని, యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. ఓటీటీలోనూ ఆకట్టుకుంటుంది ఈ సినిమా..

Mathu Vadalara 2: రియా దొరికేసిందిరోయ్..! మత్తువదలరా 2 భామ మాములుగా లేదుగా..
Mathu Vadalara 2

Updated on: Oct 21, 2024 | 6:37 PM

రీసెంట్ డేస్ లో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుడుకున్న సినిమా మత్తువదలరా 2. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో వచ్చిన మత్తువదలరా సినిమాకు సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా.. మత్తువదలరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిరేకెత్తించిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. సినిమా చూసిన వారందరూ కడుపుబ్బా నవ్వుకున్నామంటున్నారు. ముఖ్యంగా సత్య కామెడీ నెక్స్ట్ లెవల్ అంటున్నారు. సత్య సింగిల్ హ్యాండ్ తో సినిమా నడిపించాడని అంటున్నారు ప్రేక్షకులు.

ఇది కూడా చదవండి : విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..

అలాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమాలో చాలా మీమ్స్ ను వాడుకున్నారు, రెగ్యులర్ గా సోషల్ మీడియాలో దర్శనమిచ్చే మీమ్స్ ను మత్తువదలరా 2లో చాలానే వాడారు. అలాగే ఈ సినిమాలో ఓ డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. అదే రియా ఎక్కడ.?

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది.. ఈ హీరోయిన్ టక్కరిదొంగ ముద్దుగుమ్మా..! ఎంతగా మారిపోయింది.!!

సత్య అజయ్ మధ్య జరిగే డిస్కషన్ లో ఈ డైలాగ్ వినిపిస్తుంది.. కాగా సత్య అజయ్ ను రియా ఎక్కడ.? అని అడగ్గా అజయ్ రియా ఎవరు అని అడుగుతాడు. దానికి దామిని డాటర్ అని సత్య అనగానే.. దామిని ఎవరు.? అని తిరిగి ప్రశ్నిస్తాడు అజయ్. దానికి సత్య రియా మదర్ అని చెప్తాడు.. అసలు వాళ్లిద్దరూ ఎవరు అని అజయ్ అడగ్గా.. మదర్ అండ్ డాటర్ అని సమాధానం చెప్తాడు సత్య. ఈ ఫన్నీ డిస్కషన్  బాగా పాపులర్ అయ్యింది. దాంతో సోషల్ మీడియాలోనూ రియా ఎక్కడ.? అంటూ నెటిజన్స్ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అసలు ఈ రియా ఎవరు అని కూడా నెటిజన్స్ గూగుల్ లో గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె పేరు ఇషా యాదవ్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇషా యాదవ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us