పసివాడి ప్రాణం విలన్ గుర్తున్నాడా.? సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు స్కూల్‌లో ఇలా

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీస్‌లో పసివాడి ప్రాణం ఒకటి. చిరంజీవి ఫేవరెట్ డైరెక్టర్‌ కొండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్‌ గా నటించింది. అలాగే ఈ సినిమాలో మాటలు రాని చిన్నారిగా నటించి ఆకట్టుకుంది సుజిత.

పసివాడి ప్రాణం విలన్ గుర్తున్నాడా.? సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు స్కూల్‌లో ఇలా
Chiranjeevi

Updated on: May 29, 2026 | 10:00 AM

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా పసివాడి ప్రాణం. ఈ సినిమా మంచివిజయాన్ని అందుకోవడమే కాదు అప్పటిలో మెగాస్టర్ క్రేజ్ ను డబుల్ చేసింది. కాగా ఈ సినిమాలో క్రూరమైన విలన్‌గా నటించి, చిన్నారిని కిడ్నాప్ చేసి, ప్రేక్షకులను భయపెట్టిన నటుడు బాబు ఆంటోనీ. మెగాస్టార్‌తో పోటాపోటీగా ఫైట్లు చేసిన ఈ నటుడిని చాలామంది ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. మాటలు రాని చిన్నారిని ఎత్తుకుపోయే కిడ్నాపర్ పాత్రలో ఆయన పండించిన విలనిజం ఆ సినిమా విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి. బాబు ఆంటోనీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భారతీయ భాషల్లో విలన్‌గా, సహాయ నటుడిగా సుమారు 175కు పైగా చిత్రాలలో నటించారు.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్‌లో అందరూ షాక్ అయ్యాం..

తెలుగులో ఆయన ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కనిపించారు. పసివాడి ప్రాణంతో పాటు త్రినేత్రుడు, జేబు దొంగ, అడవిలో అభిమన్యుడు, లారీ డ్రైవరు, శత్రువు, చైతన్య, శాంతి క్రాంతి వంటి హిట్ చిత్రాలలో ఆయన విలనిజం పండించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన పెద్ద శరీరం, మార్షల్ ఆర్ట్స్‌లో ఆయనకున్న నైపుణ్యం తెరపై ఆయన పాత్రలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రస్తుతం బాబు ఆంటోనీ తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా, ఇతర భాషల్లో సినిమాలు చేస్తూనే ఉన్నారు. మొన్నామధ్య మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మళ్ళీ పలకరించారు. సినిమాలకు దూరంగా ఉన్నా, బాబు ఆంటోనీ నిత్యం బిజీగానే ఉన్నారు.

ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్‌లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..

మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడైన ఆయన స్వయంగా తన పేరు మీదనే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ స్కూల్ ను స్థాపించారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ స్కూల్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, వాటి ద్వారా అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇది ఆయన ప్రధాన వృత్తిగా మారింది. అప్పుడప్పుడు సినిమాల్లో నటించే అవకాశాలు వస్తే, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. బాబు ఆంటోనీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆయన రష్యన్-అమెరికన్ మహిళ ఇవాగ్నియాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆర్థర్ ఆంటోనీ, అలెక్స్ ఆంటోనీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన తన మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ వ్యవహారాలను చూసుకుంటూ, కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందంగా గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!

Pasivadi Pranam

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us