
సినిమా హిట్ ఫ్లాప్ అనేది మేకర్స్ చేతిలో ఉండు.. కేవలం ప్రేక్షకుడు మాత్రం సినిమా రిజల్ట్ డిసైడ్ చేస్తాడు. ఎంతమంది రివ్యూలు రాసినా.. ప్రమోషన్స్ లో సినిమాలను ఎంత లేపిన ఫైనల్ గా ఆడియన్స్ చేతిలోనే సినిమా జాతకం ఉంటుంది. భారీ బడ్జెట్ పెట్టి, స్టార్ హీరోలు, హీరోయిన్స్ పెట్టి సినిమా తీసిన కొన్నిసార్లు డిజాస్టర్ అవుతుంటాయి. అలాగే ఎలాంటి అంచనాలు లేకూండా వచ్చిన చిన్న సినిమాలు ఊహించని విధంగా విజయాలను అందుకునుటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విజయాలను అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఓ సినిమా సినీ ప్రపంచంలోనే చెత్త సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఎంత డిజాస్టర్ అంటే కనీసం సినిమాలో నటించిన ఓ స్టార్ యాక్టర్ రెమ్యునరేషన్ కూడా రాబట్టలేకపోయింది.
ఈ సినిమా చిన్న సినిమా కాదు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. 1400 కోట్లు పెట్టి సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.. కట్ చేస్తే రూ.6కోట్లు రాబట్టింది.. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో.. ఆ సినిమా మరేదో కాదు.. ఆ సినిమా పేరు డెజర్ట్ వారియర్. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. ఈ సినిమాలో మార్వెల్ స్టార్ ఆంథోనీ మాకీ, లెజెండరీ నటుడు బెన్ కింగ్స్లీ వంటి చాలా మంది నటించారు.
ఈ సినిమాను సౌదీ అరేబియా MBC గ్రూప్ నిర్మించింది. ఈ సినిమాకు రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్ రూపెర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు కూడా హాలీవుడ్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఉన్నప్పటికీ డెజర్ట్ వారియర్ వాటిని మించి డిజాస్టర్ అయ్యింది. 2026 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఏకంగా 99.6 శాతం పెట్టుబడి నష్టపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి